ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధం మధ్యలోనే ముగిసిందన్నబాధ ఒకప్రక్క.. లేనిపోని కథనాలు అల్లుతూ, సోషల్ మీడియా ద్వారా ఎదురవుతున్న విమర్శలు, ఆరోపణలు మరోప్రక్క, ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సహజంగా ఆత్మస్తైర్యం కలిగిన సమంత వీటన్నిటిని ఎదిరించి నిలబడ్డారు.
కాగా విడాకుల ప్రకటన తర్వాత వచ్చిన మొదటి దీపావళిని Samantha గ్రాండ్ గానే జరుపుకున్నారు. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డి ఫ్యామిలీతో పాటు దివాళి వేడుకలలో పాల్గొన్నారు. శిల్పారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సమంత ఫోటోలకు ఫోజులిచ్చారు. సదరు ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సమంత-శిల్పారెడ్డి దివాళీ సెలెబ్రేషన్స్ లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన సైతం పాల్గొనడం విశేషం. శిల్పారెడ్డి, సమంతకు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్. తరచుగా వీరు ఫ్యామిలీ పార్టీలలో కలుస్తారు. ఫిట్నెస్ డైట్ ఎక్స్పర్ట్ అయిన శిల్పారెడ్డికి Upasana konidelaతో చాలా కాలంగా స్నేహం ఉన్నట్లు సమాచారం. దీనితో ఈ ముగ్గురు కలిసి ఘనంగా దివాళి జరుపుకున్నారు.
సమంత తన దివాళి సెలెబ్రేషన్స్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. దీనితో సదరు ఫోటోలు వైరల్ గా మారాయి. గత ఏడాది అక్కినేని కుటుంబంతో దివాళి వేడుకలు జరుపుకున్న సమంత, ఈ ఏడాది తన మిత్రులతో జరుపుకున్నారు.
ఇక శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత సమంత, సినిమాలకు బ్రేక్ ప్రకటించారు. ఈ ఖాళీ సమయాన్ని ఆమె విహారాలకు కేటాయించారు. అయితే దసరా పండుగ నాడు ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. అలాగే మరికొన్ని కొత్త సినిమాలకు ఆమె సైన్ చేయాల్సి ఉంది. సమంత తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశారంటూ వార్తలు వస్తున్నాయి.