సమంత విడాకుల తర్వాత, ఆమె ఇంట్లో పెళ్లి సందడి, వైరల్ అవుతున్న ఫోటోస్!

First Published | Sep 22, 2024, 10:03 AM IST

నటి సమంతా అన్నయ్య డేవిడ్ ప్రభు కి నిన్న విదేశాల్లో ఘనంగా వివాహం జరిగింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సమంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 

తెలుగులో స్టార్‌ హీరోగా పేరుతెచ్చుకుంది సమంత. ఆమె గతేడాది సినిమాలకు బ్రేక్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. మళ్లీ కామ్‌ బ్యాక్‌ అవుతుంది. రెండు ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఆమె ఇంట్లో ఇప్పుడు పెళ్లిబాజాలు మోగాయి. నాగచైతన్యతో ఆమె విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఇంట పెళ్లి సందడి నెలకొనడం విశేషం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 సమంత తొలి సంపాదన 

సమంత చెన్నై పల్లవరంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్లలో వెల్‌ కమ్‌ గర్ల్ గా పనిచేసే స్థాయి నుంచి ఇప్పుడు సౌత్‌లోనే స్టార్‌ హీరోయిన్ గా ఎదిగింది. తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత, సినిమాల్లో అవకాశం కోసం వెతుకుతున్న రోజుల్లో 500 - 1000 రూపాయలకు పలు వివాహ రిసెప్షన్లలో పాల్గొని, దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆడిషన్లకు హాజరయ్యేదాన్ని అని పలు ఇంటర్వ్యూలలో సమంత స్వయంగా చెప్పడం విశేషం. 


సమంతా సినిమా ఎంట్రీ

ఆమె తమిళంలో నటించిన మొదటి చిత్రం పెద్దగా విజయం సాధించలేదు,  దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో, తెలుగులో నాగ చైతన్య సరసన నటించిన 'ఏ మాయ చేశావె' చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది సమంత. 

సమంతా - నాగ చైతన్య వివాహం

చాలా తక్కువ సమయంలోనే, తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంతా లైమ్ లైట్‌లో ఉండగానే, హీరో నాగార్జున కొడుకు, యువ సామ్రాట్‌ నాగచైతన్యతో ప్రేమలో పడింది. 2017లో పెళ్లి చేసుకున్నారు.  పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగిన సమంతా - చైతన్యల వైవాహిక జీవితంలో విడిపోవడానికి సమంతా ఎంచుకున్న సినిమాలే కారణమని చెబుతున్నారు. కానీ బయటకు రాని కారణాలు చాలా ఉన్నాయి. 

సమంతా విడాకులు

ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలతో సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలను తొలగించిన సమంతా.. కొన్ని నెలల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంతా ప్రస్తుతం తన మయోసైటిస్ సమస్య నుంచి బయటపడి, మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుండగా, నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. హీరోయిన్‌ శోబితా దూళిపాళ్లని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది. శోభితాతో చైతూ క్లోజ్‌గా ఉండటం కూడా వీరి విడాకులకు కారణమని తెలుస్తుంది.

సమంతా అన్నయ్య పెళ్లి

 ఇదిలా ఉంటే, సమంతా అన్నయ్య డేవిడ్ ప్రభు, నికోలాయ్ అనే విదేశీ యువతి వివాహం జరిగింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను సమంతా ఇప్పుడు విడుదల చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు సమంతా అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 ఈ సందర్భంగా సమంత అన్నయ్య పెళ్లి ఫోటోలు, అలాగే ఫ్యామిలీ పిక్స్ నెట్టంట వైరల్‌ అవుతున్నాయి. ఇందులో స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతుంది సమంత. ప్రస్తుతం ఆమె `మా ఇంటి బంగారం` సినిమాలో నటిస్తుంది. హిందీలో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ చేసింది. దీంతోపాటు మరికొన్ని ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయట. 

Latest Videos

click me!