అభయ్‌ని ఉతికి ఆరేశావ్‌ ఓకే.. మరి సోనియా, నిఖిల్‌, పృథ్వీ చేసే గబ్బు పనులేంటి? బిగ్‌ బాస్‌పై ట్రోల్

First Published | Sep 22, 2024, 7:57 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 శనివారం ఎపిసోడ్‌లో అభయ్‌ని ఉతికి ఆరేశాడు నాగార్జున. కానీ వాళ్లు చేస్తున్న పనులేంటి? అంటూ బిగ్‌ బాస్‌ ని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ మూడో వారం(21వ రోజు) కూడా పూర్తి కావస్తుంది. ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్‌ ఉండబోతుంది. ఈ వారం అభయ్‌ నవీన్ ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది. ఆయన ప్రవర్తన విషయంలో శనివారం ఎపిసోడ్‌లో బిగ్‌ బాస్‌ ఆడుకున్నాడు. హోస్ట్ నాగ్ ఓ రకంగా ఉతికి ఆరేశాడు. రెడ్‌ కార్డ్ చూపించి డైరెక్ట్ గా హౌజ్‌ నుంచి బయటకు వెళ్లు  అంటూ డోర్స్ ఓపెన్‌ చేశాడు. హౌజ్‌ మేట్స్ రిక్వెస్ట్ మేరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు నాగార్జున. ఇక్కడ బిగ్‌ బాస్‌ రూల్స్ ఉంటాయని, ఆయన చెప్పినట్టు చేయాల్సిందే అని, బిగ్‌ బాస్‌ కంటె ఎవరూ ఎక్కువ కాదని, అలా అనుకుంటే వెళ్లిపోవచ్చు అని, అభయ్‌తోపాటు మిగిలిన హౌజ్‌ మేట్స్ కి వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్‌లో తక్కువ ఓట్ల కారణంగా అభయ్‌ హౌజ్‌ ని వీడుతున్నట్టు తెలుస్తుంది. ఈ వారం చీఫ్‌గా ఎంపికైన అభయ్‌, సెల్ఫ్‌గా నామినేషన్‌లోకి వచ్చాడు. ఇద్దరు చీఫ్‌ల్లో ఒకరు నామినేట్‌ కావాల్సి ఉంటుంది. దీంతో తానే నామినేట్‌ అవుతున్నట్టు, తన సత్త ఏంటో చూపించుకుంటానని తెలిపారు అభయ్‌.

కానీ తక్కువ ఓట్ల కారణంగా ఆయన ఈ వారం ఎలిమినేట్‌ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే అభయ్‌ని ఇంటి నుంచి పంపడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొంత మంది నోటి దూల కారణంగానే ఎలిమినేట్‌ అయ్యాడని, ఆయన ఓవరాక్షన్‌ వల్లే ఇదంతా జరిగిందని, బిగ్‌ బాస్‌ రూల్స్ గురించి తెలిసి ఎందుకు హౌజ్‌కి వచ్చినట్టు అంటూ ఆయన ఎలిమినేషన్‌ని సమర్థిస్తున్నారు. 


మరోవైపు అభయ్‌ని సమర్థించేవాళ్లు ఉన్నారు. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ ని పంపిస్తున్నారని, మిగిలిన పప్పు బ్యాచ్‌ల కంటే చాలా బెటర్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. బిగ్ బాస్‌ రూల్స్ చెత్తగా ఉంటున్నాయనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. బిగ్‌ బాస్‌కి కరెక్ట్ గాడు తగిలాడు అంటూ సోషల్‌ మీడియాలో అభయ్‌ని సమర్థించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అంతేకాదు అభయ్‌ నిజంగానే తక్కువ ఓట్లు వచ్చాయా? కావాలని పంపిస్తున్నారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 

ఇంకోవైపు హౌజ్‌లో జరుగుతున్న వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. రెండు వారాలుగా సోనియా, పృథ్వీరాజ్‌, నిఖిల్‌ మధ్య రహస్యంగా ఏదో జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ నడుస్తుంది. అయితే ఇది బయటకు చెప్పుకునేంత ప్రేమ వ్యవహారం కాదు, అదే సమయంలో దాచడానికి కూడా లేదు. ప్రేమికులుగా ఏం మాట్లాడుకోవడం లేదు. కానీ సోనియా కోసం నిఖిల్‌, పృథ్వీ నిలబడుతున్నారు. ఆమె కోసం పోరాడుతున్నారు. ఆమెని ఏమన్నా అంటూ ఊరుకోవడం లేదు. 
 

అయితే సోనియా.. నిఖిల్‌, పృథ్వీలను టచ్చింగ్‌గా తన కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. ఆమె ఆ ఇద్దరి టచ్‌ చేస్తూ, చేతులు నిమురుతూ, బాడీలో అసభ్యకరమైన ప్రాంతాల్లో టచ్‌ చేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుంది. దానికి కొన్నిసార్లు వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.

అయితే దీనిపై నెగటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. బిగ్‌ బాస్‌షోనా? బూతు షోనా అంటూ ప్రశ్నిస్తున్నారు. కెమిస్ట్రీ వర్కౌట్‌ కావడం, ప్రేమ కబుర్లు చెప్పుకోవడం వరకు ఓకే, ఇలాంటి గలీజ్‌ పనులేంటి? అంటున్నారు. సోనియా పనులు మరో రకంగా రెచ్చగొట్టేలా ఉంటున్నాయి అంటున్నారు నెటిజన్లు.

అభయ్‌ విషయంలో అంతగా రెచ్చిపోయిన నాగ్‌(బిగ్‌ బాస్‌), ఇలాంటి పనులను ఎందుకు కంట్రోల్‌ చేయడం లేదు. దీని ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఇది ఆడియెన్స్ ని మిస్‌ గైడ్‌ చేయడం కాదా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

హగ్‌ చేసుకోవడం వరకు ఓకే, ముద్దులు పెట్టుకోవడమేంటి? ఆ చిల్లర చేష్టలేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. బిగ్‌ బాస్‌ని ట్రోల్‌ చేస్తున్నారు. మొత్తంగా ఈ ముగ్గురి వ్యవహారం రచ్చ రచ్చగా మారుతుంది. షోపై అభిప్రాయాన్ని మార్చేస్తుందనేది నిజం. మరి బిగ్‌ బాస్‌ దీన్ని కంట్రోల్‌ చేస్తాడా? అనేది చూడాలి. 
 

Latest Videos

click me!