పవన్‌, ప్రభాస్‌లకు అల్లు అర్జున్‌ షాక్‌, సక్సెస్‌ రేట్‌లో ఎన్టీఆర్‌, మహేష్‌, రామ్‌ చరణ్‌ ఎవరి స్థానం ఎక్కడంటే?

First Published | Sep 22, 2024, 9:35 AM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో అత్యధిక సక్సెస్‌ రేట్‌ ఎవరికి ఉంది? ఎవరు లాస్ట్ లో ఉన్నారు? ప్రభాస్‌, పవన్‌, బన్నీ, ఎన్టీఆర్‌, మహేష్‌, చరణ్‌ల స్థానం ఏంటో తెలుసా?
 

సినిమాల్లో సక్సెస్‌ రేట్‌ చాలా తక్కువ. ఏడాదికి పది శాతం కూడా నమోదు కావడం కష్టం. అలానే హీరోల సక్సెస్‌ రేటు కూడా అంతే. మూడు నాలుగు సినిమాలకు ఒక్కటి హిట్‌ అవుతుంది. అది వాళ్ల స్థాయిని పెంచుతుంది. ఫెయిల్‌ అయితే క్రేజ్‌, ఇమేజ్‌ పడిపోవడం తక్కువగానే ఉంటుంది. అదే ఒక పెద్ద హిట్‌ వచ్చిందంటే ఆయన రేంజ్‌ అమాంతం పెరిగిపోతుంది. మార్కెట్‌ పెరుగుతుంది. సినిమాల బడ్జెట్‌ పెరుగుతుంది. ఇచ్చే పారితోషికం పెరుగుతుంది. ఇదంతా ఓ రేంజ్‌ ఫ్యాన్‌ బేస్ ఉన్న హీరోల విషయంలో జరుగుతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్, అభయ్‌ని ఉతికి ఆరేశావ్ ఓకే, ఆ ముగ్గురు చేసే పనులేంటి?
 

Vijay Devarakonda

కుర్ర హీరోలైతే ప్రతి సినిమా ఒక యుద్ధమే. ఓ రేంజ్‌కి వచ్చేంత వరకు ప్రతి సినిమా జాగ్రత్తగా చేయాలి. హిట్‌ కొట్టాలి, అప్పుడే వాళ్ల మార్కెట్‌, ఇమేజ్‌, ఫ్యాన్‌ బేస్‌ పెరుగుతుంది. ఒక్కసారి ఆ సూపర్‌ స్టార్‌ రేంజ్‌కి వచ్చారంటే రెండు మూడు సినిమాలు ఫ్లాప్‌ అయినా పెద్దగా నష్టం ఉండదు, నిర్మాతలు, బయ్యర్లు లాస్‌ అవుతారుగానీ, హీరో సేఫ్‌గానే ఉంటాడు. ఒక్క హిట్‌ తో మూడు నాలుగేళ్లు సర్వైవ్‌ కాగలరు. మరి ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్లు చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీలను పక్కన పెడితే, సూపర్‌ స్టార్లుగా రాణిస్తున్న ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌లలో ఎవరి సక్సెస్‌ రేట్‌ ఏంటో ఓ సారి చూద్దాం. 
 

Latest Videos


సక్సెస్‌ రేట్‌ విషయంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మొదటి స్థానంలో ఉన్నారు. బన్నీ తన రెండు దశాబ్దాల కెరీర్‌లో 20 సినిమాలు చేశాడు. అందులో ఏకంగా 14 సినిమాలు విజయం సాధించాయి. దీంతో 70 శాతం సక్సెస్‌ రేట్‌తో స్టార్‌ హీరోల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న ప్రభాస్‌ని సైతం వెనక్కి నెట్టేశాడు. `పుష్ప 2`తో రాబోతున్న అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్ఠార్‌ ఇమేజ్‌ని పదిలం చేసుకోబోతున్నారు. 
 

ఇక పవన్‌ స్టార్‌గా రాణిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ సక్సెస్‌ రేట్‌లో చివర్లో ఉన్నారు. ఆయన 28ఏళ్ల కెరీర్‌లో 28 సినిమాలు చేశారు. ఇందులో 11 సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. ఇలా 40శాతం సక్సెస్‌ రేట్‌తో లాస్ట్ లో ఉన్నారు. కానీ మూడు నాలుగేళ్లకి ఒక్క హిట్‌ పడ్డా, తన రేంజ్‌ ఏంటో చూపిస్తాడు పవన్‌.

ఇటీవల కాలంలో ఆయన స్థాయి హిట్‌ పడలేదు. `ఓజీ`పై ఆశలు పెట్టుకున్నారు. అది ఏం చేస్తుందో చూడాలి. ప్రస్తుతం ఓ వైపు ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తూనే కమిట్‌ అయిన సినిమాలు `ఓజీ`, `హరిహర వీరమల్లు`, `ఉస్తాద్‌భగత్‌ సింగ్‌`ను పూర్తి చేయబోతున్నారు పవన్‌. పవర్‌ స్టార్‌ ఇమేజ్‌కి సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేదని చెప్పొచ్చు. 

రెండో స్థానంలో రామ్‌ చరణ్‌ ఉండటం విశేషం. ఆయన ఇప్పటి వరకు 14 సినిమాలే చేశాడు. ఇందులో 9 సినిమాలు హిట్‌ అయ్యాయి. 63శాతం సక్సెస్ రేట్‌తో బన్నీ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిన చెర్రీ, గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ కోసం తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం ఆయన `గేమ్‌ చేంజర్‌` చిత్రంతో బిజీగా ఉన్నారు. 

యాభై శాతం సక్సెస్‌ రేట్‌తో మూడో స్థానంలో నిలిచారు మహేష్‌ బాబు. ఆయన కూడా రెండున్నర దశాబ్దాల సినిమా కెరీర్‌లో 28 సినిమాలు చేశారు. అందులో 14 సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. సూపర్‌ స్టార్‌గా ఇమేజ్‌తో రాణిస్తున్నారు మహేష్‌. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన ఆయన ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేశాడు. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అంతర్జాతీయ ప్రమాణాలతో, ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో తెరకెక్కుతుంది. 
 

సక్సెస్‌ రేట్‌లో నాల్గో స్థానంలో ఎన్టీఆర్‌ నిలిచారు. ఆయన ఇప్పటి వరకు 29 సినిమాలు చేశారు. ఇందులో 13 చిత్రాలు సక్సెస్‌ అయ్యాయి. 45శాతం సక్సెస్‌ రేట్‌తో నాల్గో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన `దేవర` చిత్రంతో రాబోతున్నారు. ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా విజయం తారక్ కి చాలా కీలకంగా మారబోతుంది. 
 

గ్లోబల్‌ స్టార్‌ గా, ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచిన ప్రభాస్‌ సక్సెస్‌ రేట్‌ ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆయన ఇప్పటి వరకు 23 సినిమాలు చేశాడు. ఇందులో కేవలం 10 మూవీస్‌ మాత్రమే హిట్‌ అయ్యాయి. 43శాతం సక్సెస్‌ రేట్‌తో రాణిస్తున్నారు డార్లింగ్‌. కానీ కొడితే కుంభస్థలమే కొట్టాలన్నట్టు, భారీ విజయాలు సాధించాయి.

`బాహుబలి`తో ఆయన రేంజ్‌ మారిపోయింది. `సలార్‌`, `కల్కి` చిత్రాలతో తన రేంజ్‌ని చూపించారు ప్రభాస్‌. ఆయన ఫ్లాప్‌ సినిమాలు కూడా మూడు, నాలుగు వందల కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్‌ ఏకంగా నాలుగైదు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
 

click me!