Samantha: ఘనంగా సమంత సీమంతం.. మొదటి బిడ్డను సామ్ ఎప్పుడు కనబోతుందో తెలుసా?

Published : Jul 15, 2026, 11:56 AM IST

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆమె ప్రసూతి సెలవులు తీసుకోబోతున్నట్టు ప్రకటించింది కూడా. ఇక తాజాగా సమంత సీమంత ఘనంగా జరిగింది. ఈ వేడుక ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

PREV
14
సమంత సీమంతం సందడి..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నివాసంలో ప్రస్తుతం పండగ వాతావరణం, సందడి నెలకొంది. త్వరలోనే తల్లి కాబోతున్న ఆమెకు మంగళవారం నాడు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ ఫొటోలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

24
మొదటి బిడ్డకు సమంత ఎప్పుడు వెల్కం చెప్పబోతోంది?

సమంత, ఆమె భర్త ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు తమ తొలి సంతానం కోసం ఎంతో ఆతృతగా, ఆనందంగా ఎదురుచూస్తున్నారు. 2025 చివరిలో కోయంబత్తూరు లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్ నెలలో సమంత తన మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారని తెలుస్తోంది. . ఈ క్రమంలో నిర్వహించిన సీమంతం వేడుకలో సమంత ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించింది. భర్తతో పాటు బంధువులు, స్నేహితులు అంతా కలిసి ఎంతో సంతోషంగా ఈ వేడుకను నిర్వహించుకున్నారు.

34
మా ఇంటి బంగారం ఈవెంట్ లో మొదటిసారి..

కుటుంబ సభ్యుల మధ్య అత్యంత ఆత్మీయంగా జరిగిన ఈ వేడుకలో, తన అత్తగారితో ఆమె పంచుకున్న కొన్ని ఎమోషనల్ క్షణాలకు సంబంధించిన దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.గత జూన్ నెలలో విడుదలైన 'మా ఇంటి బంగారం' చిత్ర విజయోత్సవ వేడుకలో సమంత మొదటిసారిగా బేబీ బంప్‌తో దర్శనమిచ్చారు. ఆ సమయంలోనే ఆమె గర్భవతి అనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ తర్వాత సదరు చిత్ర దర్శకుడు కూడా అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

44
అధికారికంగా స్పందించలేదు కానీ..

అప్పటి నుంచి సమంత తన గర్భధారణకు సంబంధించిన విశేషాలను, అనుభవాలను అప్పుడప్పుడు సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం సీమంతం వేడుకపై సమంత దంపతులు అధికారికంగా ఎలాంటి ప్రకటన కానీ.. స్పందన తెలియజేయనప్పటికీ, సోషల్ మీడియా లో అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు ఈ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories