Lenin Villain: అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాటు, ఇందులో నటించిన కన్నడ నటుడు ప్రమోద్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
టాలీవుడ్‌లో అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రంతో కన్నడ నటుడు ప్రమోద్ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాలో 'వసంత్' అనే కీలక పాత్రలో కనిపించిన ప్రమోద్ నటనకు ప్రేక్షకులు, సినీ ప్రియుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
25
ఇప్పటి వరకు విలన్ పాత్ర చేయలేదు
సినిమా విజయం సాధించిన ఆనందంలో ప్రమోద్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. 'లెనిన్' సినిమాలో తన పాత్ర ఎలా వచ్చిందో ఆసక్తికరంగా వివరించారు. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు కథ చెప్పిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ.. 'వసంత్ పాత్ర కథ వినగానే నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. ఆ పాత్రలోని లోతు, దాని ప్రయాణం, కథలో దాని ప్రాముఖ్యత నన్ను చాలా ఆకర్షించాయి. ఈ పాత్ర నేనే చేయాలని మనసులో నిర్ణయించుకున్నా, కానీ ఇప్పటివరకు విలన్‌గా చేయలేదని దర్శకుడికి చెప్పాను' అని ప్రమోద్ తెలిపారు.
35
నా కథలో నువ్వు యాంటీ హీరో
దానికి దర్శకుడు స్పందిస్తూ, 'ఇది విలన్ పాత్ర కాదు బ్రదర్... నా కథలో నువ్వు యాంటీ హీరో' అని చెప్పిన క్షణంలోనే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం మొదలైంది. అక్కడి నుంచే 'వసంత్' పాత్ర ప్రయాణం మొదలైంది అని ప్రమోద్ తన అనుభవాన్ని పంచుకున్నారు. 'ఈ రోజు తెలుగు ప్రేక్షకులు నా పాత్రకు ఇస్తున్న ప్రేమ, ప్రశంసలు చూసి నా మనసు నిండిపోయింది. నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కిషోర్ అబ్బూరు, నాగార్జున గారు, అఖిల్ అన్న, అన్నపూర్ణ స్టూడియోస్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని కృతజ్ఞతలు తెలిపారు.
'లెనిన్' సినిమాలో అఖిల్ అక్కినేని హీరోగా నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటులు శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావ్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రతి ఒక్కరి నటనకు మంచి స్పందన వస్తోంది. మొత్తానికి, 'లెనిన్' సినిమా విజయంతో పాటు ప్రమోద్ పోషించిన వసంత్ పాత్ర కూడా సినీ ప్రియుల మనసు గెలుచుకుంది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన నటనకు కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది.
55
లెనిన్ కలెక్షన్లు
జులై 10న విడుదలైన `లెనిన్` మూవీ వసూళ్ల పరంగానూ సత్తా చాటుతోంది. ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు రూ.70కోట్లు సాధించినట్టు టీమ్ తెలిపింది. కానీ రూ.45కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్ సైట్లు చెబుతున్నాయి. మొత్తంగా మాత్రం `లెనిన్` హిట్ టాక్ తో దూసుకుపోతుంది.