టాలీవుడ్ లో రీమేక్ చిత్రాల జోలికి పోని స్టార్ హీరోలు కొందరు ఉన్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఒరిజినల్ స్టోరీలతోనే మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయనని నిర్మొహమాటంగా మహేష్ చెప్పేశారు. అయితే ఈ విషయంలో మహేష్ బాబుకి, సమంతకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.