అమల ప్రెగ్నెన్సీతో ఉండగా డాక్టర్ల చీటింగ్..అమ్మాయి పుడుతుందని పేరు కూడా ఫిక్స్ చేసిన నాగార్జున

Published : Jul 19, 2024, 10:07 AM IST

మొదటి భార్య నుంచి విడిపోయిన తర్వాత నాగార్జున.. అమలని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1992లో నాగార్జున, అమల వివాహం జరిగింది. 1994లో వీరికి అఖిల్ జన్మించాడు.

PREV
16
అమల ప్రెగ్నెన్సీతో ఉండగా డాక్టర్ల చీటింగ్..అమ్మాయి పుడుతుందని పేరు కూడా ఫిక్స్ చేసిన నాగార్జున
Nagarjuna-Amala

మొదటి భార్య నుంచి విడిపోయిన తర్వాత నాగార్జున.. అమలని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1992లో నాగార్జున, అమల వివాహం జరిగింది. 1994లో వీరికి అఖిల్ జన్మించాడు. అయితే అమల ప్రెగ్నెన్సీ సమయంలో భలే గమ్మత్తైన విషయం జరిగింది. 

26

నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనైతే ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నా. అమల డెలివరీకి ఇంకా 6 నెలల సమయం ఉండగా యుఎస్ పంపించేశా. అక్కడ ట్రీట్మెంట్ బావుంటుంది.. వాకింగ్ కూడా ఫ్రీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో పంపించినట్లు నాగార్జున తెలిపారు. అఖిల్ జన్మించింది యుఎస్ లోనే. 

36
Amala Akkineni

అక్కడ యుఎస్ లో డాక్టర్లు స్కానింగ్ చేసి ఆడపిల్ల అని చెప్పారు. నేనైతే ఎగిరి గంతేశా.. నాకు ఆడపిల్ల పుడుతోందని. అమ్మాయికి నిఖిత అని పేరు కూడా ఫిక్స్ చేశా. రిటర్న్ టికెట్ నిఖిత పేరు మీద బుక్ చేశా. అమ్మాయిల డ్రెస్సులు కూడా కొన్నా. 

46

డెలివరీకి రెండు రోజుల ముందు అమల చెప్పింది. మనకి పుట్టబోయేది అబ్బాయే.. నువ్వు ఫిక్స్ అయిపో అని చెప్పింది. అదేంటి అని అడిగా. నాకు కలలో తెలిసింది అని చెప్పింది. నేను డాక్టర్లు చెప్పారు కదా అమ్మాయి పుడుతుందని.. అమ్మాయే పుడుతుందని నమ్మకంతో ఉన్నా. కానీ డెలివరీ తర్వాత చూస్తే అబ్బాయి. నేను షాక్ అయ్యా. 

56

డాక్టర్లు ఎందుకు చీట్ చేశారు.. ఎక్కడ తప్పు జరిగింది అని ఆరా తీస్తే.. స్కానింగ్ రిపోర్ట్ లో కూడా తప్పు రావడానికి 5 శాతం ఛాన్స్ ఉందని చెప్పారు. వాళ్ళు స్కాన్ చేసే సమయంలో అఖిల్ కాళ్ళు ముడుచుకున్నాడో ఏమో తెలియదు అంటూ నవ్వుతూ చెప్పారు. 

66
Akhil Akkineni

ఆ తర్వాత అమ్మాయి కోసం ప్రయత్నిద్దాం అని అనుకున్నా అమల వద్దంది. ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చాలులే అని చెప్పింది నాకు కూతురు లేకపోవడం కూడా లైఫ్ లో పెద్ద డిసప్పాయింట్మెంట్ అని నాగార్జున అన్నారు. 

click me!

Recommended Stories