ఒకవైపు రూమర్స్.. మరోవైపు చైతు లేకుండానే గోవా వెకేషన్ లో సమంత, ఫోటోస్ వైరల్

First Published Sep 6, 2021, 11:35 AM IST

అక్కినేని ఫ్యామిలీలో ఏదో జరుగుతోంది అనే రూమర్స్ రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. ఈ రూమర్లకు బలాన్నిచ్చే విధంగా చైతు, సమంత ప్రవర్తిస్తున్నారనే ప్రచారం ఎక్కువైంది. 

అక్కినేని ఫ్యామిలీలో ఏదో జరుగుతోంది అనే రూమర్స్ రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. ఈ రూమర్లకు బలాన్నిచ్చే విధంగా చైతు, సమంత ప్రవర్తిస్తున్నారనే ప్రచారం ఎక్కువైంది. 

రూమర్స్ వ్యాపిస్తున్న తరుణంలోనే సమంత గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. సమంత తన స్నేహితురాలి శిల్పా రెడ్డితో గోవా వెకేషన్ కు వెళ్ళింది.మరోవైపు నాగ చైతన్య తన సినిమాల షూటిన్స్ తో బిజీగా ఉన్నాడు. 

సమంత ఇటీవల క్రేజీ ప్రాజెక్ట్ శాకుంతలం షూటింగ్ పూర్తి చేసింది. దీనితో సినిమాల నుంచి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని వెకేషన్ కు వెళ్ళింది. సమంత తన నెక్స్ట్ మూవీకి ఇంకా సైన్ చేయలేదు. 

సమంత సమంత చివరగా జాను చిత్రంలో నటించింది. అలాగే ఈ ఏడాది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పోషించిన రాజి పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఇక సమంత గోవా వెకేషన్ విషయానికి వస్తే.. తన ఫ్రెండ్స్ తో బోటింగ్, సైక్లింగ్ చేస్తూ సమంత సరదాగా గడుపుతోంది. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

గోవా కూల్ వెదర్ లో సమంత వెకేషన్ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్యన సమంత సోషల్ మీడియాలో తన పేరు నుంచి అక్కినేని తొలగించినప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. 

సమంత, చైతు మధ్య రిలేషన్ సరిగా లేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై అక్కినేని ఫ్యామిలీ మౌనం వహిస్తోంది. నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ లో కూడా సమంత కనిపించలేదు. 

click me!