సమంత నే కావాలంటున్న ఎన్టీఆర్.. యంగ్ టైగర్ సినిమాలో సామ్ ఫిక్స్ అయినట్టేనా..?

First Published | Oct 13, 2024, 6:30 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో సమంత.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త ఇదే. గతంలో వీరి కాంబోలో సినిమాలు వచ్చాయి. అయితే ఈ సారి సమంత ఏ పాత్ర చేయబోతుందో తెలుసా..? 

ntr, devara2, koratala shiva

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.. పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లతో ఈమూవీ ఇప్పటికీ దూసుకుపోతోంది. కాగా ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ ఊపుతోనే నెక్ట్స్ సినిమాలపై కూడా గట్టిగా కాన్సంట్రేషన్ చేశాడు తారక్. ఇక ఎన్టీఆర్ కోసం దర్శకులు క్యూలో ఉన్నారు. 

అయితే ఆయన నెక్ట్స్ చేయాల్సి ప్రాజెక్ట్స్ లో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో  పాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది. మరో వైపు త్రివిక్రమ్ తో కూడా ఆయన సినిమాచేస్తాడని అంటున్నారు. ఈక్రమంలోన ఎన్టీఆర్ సినిమాకు సబంధించిన ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. 


ఎన్టీఆర్ సినిమాలో సమంత నటించబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు దశాబ్ధం పాటు.. టాలీవుడ్  ఇండస్ట్రీని స్టార్ హీరోయిన్ గా ఏలింది సమంత.   ఒకానొక టైంలో స్టార్ హీరోల నుంచి టైర్ 2 హీరోల వరకు అందరు సమంతతో ఒక సినిమాలో నటించినా చాలు.. అన్నంత క్రేజ్ ఆమె తెచ్చుకుంది. 

అసలు వరుసకు బ్లాక్ బస్టర్ సినిమాల్లో సమంత వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంది. చిన్న హీరోలతో నటించినా.. ఆమె ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోల సరసన కూడా వరుసగా ఛాన్స్ లు దక్కించుకుంది సమంత. ఇక పెళ్ళి తరువాత హీరోయిన్ గా సినిమాలు మానేసింది బ్యూటీ. నాగచైతన్యతో ప్రేమ..  అక్కినేని ఇంటి కోడలు అయిన ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేసింది సమంత. 

ఇక మనస్పర్ధలు  నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన ఆమె..నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో సమంత విడాకులు తరువాత కూడా వరుసగా సినిమాలు చేసింది. యశోద, శకుంతలం సినిమాతో పాటు విజయ్ దేవరకొండ జోడీగా ఖుషి సినిమాలో కూడా నటించింది సమంత. ఆతరువాత ఏడాదిన్నరకు పైగా ఆమె రెస్ట్ లో ఉంది. 

సినిమాలకు గ్యాప్ తీసుకుని తన మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అవుతోంది బ్యూటీ. ఇక  ఇప్పుడు సమంత ఎన్టీఆర్ కి జోడిగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో రామయ్య వస్తావయ్య సినిమా వచ్చింది. కాని ఆసినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే మళ్లీ ఈ కాంబో కలుస్తోందని టాక్. 
 

అయితే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా కాకుండా  ఒక ఐటెం సాంగ్ లో సమంత  నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్‌లో యాక్ట్‌ చేయబోతుందట. 2026 లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  

ఈమద్య పుష్ప సినిమాలో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేసింది సమంత. మరోసారి ఎన్టీఆర్, సమంత జోడిని వెండి తెరమీద కనిపిస్తారని తెలిసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

Latest Videos

click me!