ఈ క్రమంలో ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ తన టోపీ, జాకెట్‌ను తొలగించారు. ఆ తర్వాత బ్లాక్ టీషర్ట్‌ను కూడా విప్పి తన టోన్డ్ ఫిజిక్‌ను చూపించారు. 60 ఏళ్ల వయసులోనూ సల్మాన్ ఖాన్ మెయింటైన్ చేస్తున్న ఫిట్‌నెస్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వీడియోను చూసిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్, టెలివిజన్ నటుడు కుషాల్ టాండన్.. సల్మాన్‌కు సపోర్ట్ గా నిలిచారు.
కుషాల్ టాండన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సల్మాన్ ఖాన్ టీషర్ట్ తొలగిస్తున్న వీడియోను రీపోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ డెడికేషన్, డిసిప్లిన్, కంటిన్యూయిటీని ప్రశంసిస్తూ కామెంట్ చేశారు. 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఫిజిక్ సాధించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ఎలాంటి వీఎఫ్‌ఎక్స్ లేకుండా కేవలం డెడికేషన్, డిసిప్లిన్, క్రమశిక్షణతో సల్మాన్ ఈ ఫిట్‌నెస్‌ను సాధించారని కుషాల్ ప్రశంసించారు.