Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్

Published : Sep 20, 2026, 11:29 AM IST

Tamannaah Bhatia: సాధారణంగా ఆధార్ కార్డులో మన ఫోటో చూసుకుంటే మనకే నవ్వొస్తుంది. కానీ, హీరోయిన్ తమన్నా భాటియా ఆధార్ కార్డు ఫోటో చూసి నెటిజన్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.

PREV
15
ఈసారి అందరి దృష్టి 'ఆధార్ కార్డు' మీదే

సౌత్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న తమన్నా భాటియా ఎప్పుడూ తన ఫ్యాషన్, నేచురల్ బ్యూటీతో వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా పాపరాజీల కెమెరాలకు ఆమె చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చింది. అయితే, ఈసారి అందరి దృష్టి ఆమె లుక్ మీద కాకుండా చేతిలో ఉన్న 'ఆధార్ కార్డు' మీద పడింది.

25
ఆధార్ కార్డు పట్టుకునే కెమెరాలకు పోజులు

ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే హడావుడిలో ఉన్న తమన్నా, చేతిలో ఆధార్ కార్డు పట్టుకునే కెమెరాలకు పోజులిచ్చింది. దీన్ని చాలా నిశితంగా గమనించిన నెటిజన్లు, పాపరాజీలు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

35
జనాలకు ఎదురయ్యే సాధారణ అనుభవం

సాధారణంగా ఆధార్ కార్డు ఫోటో అంటేనే చాలామందికి భయం, కాస్త సిగ్గు కూడా. `నా ఆధార్ కార్డులో ఫోటో చూస్తే నాకే భయమేస్తుంది`, `ప్రపంచంలోనే చెత్త కెమెరా అంటే ఆధార్ సెంటర్‌దే` అని జనాలు జోకులు వేసుకోవడం మనకు తెలిసిందే. ఎంత అందంగా ఉన్నా ఆధార్ కెమెరా ముందు కూర్చుంటే ఫోటో విచిత్రంగా రావడం నూటికి తొంభై తొమ్మిది మందికి ఎదురయ్యే అనుభవమే.

45
క్యూట్‌గా కనిపిస్తున్న తమన్నా భాటియా

కానీ, తమన్నా భాటియా విషయంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయింది! వైరల్ అవుతున్న వీడియోలో తమన్నా చేతిలో ఉన్న ఆధార్ కార్డు ఫోటో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ చిన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కూడా ఆమె అంతే అందంగా, క్యూట్‌గా కనిపించడం విశేషం.

55
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
దీన్ని గమనించిన నెటిజన్లు, `ఆధార్ కార్డులో కూడా ఇంత బాగా ఫోటో వచ్చిన ఒకే ఒక్క అమ్మాయి తమన్నా`, `క్యా ఆప్కే ఆధార్ కార్డ్ మే అచ్ఛా ఫోటో హై?" (మీ ఆధార్ కార్డులో ఇంత మంచి ఫోటో ఉందా?) అంటూ ఫన్నీ క్యాప్షన్లతో వీడియోను షేర్ చేస్తున్నారు. `మా ఆధార్ కార్డు చూస్తే మేమే గుర్తుపట్టలేం, కానీ తమన్నా మాత్రం ఆధార్‌లోనూ మిల్కీ బ్యూటీలా మెరిసిపోతోంది`, `దేవతలు ఏ కెమెరాకు పోజులిచ్చినా అందంగానే ఉంటారు` అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి తమన్నా ఆధార్ కార్డు వీడియో ఇంటర్నెట్‌లో అందరి పెదవులపై చిరునవ్వులు పూయిస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories