1500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన మహేష్ బాబు సినిమా, వరల్డ్ రికార్డ్ సాధించిన సూపర్ స్టార్ మూవీ.

Published : Mar 19, 2025, 09:41 AM IST

Mahesh Babu Movie Sets World Record: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వరల్డ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే ఏ సినిమా సాధించలేని ఘనత సాధించింది. అయితే ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినది కాదు. దాదాపు 20 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు రికార్డ్ ను సాధించింది. ఇంతకీ ఏంటా మూవీ.

PREV
16
1500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన మహేష్ బాబు సినిమా, వరల్డ్ రికార్డ్ సాధించిన సూపర్ స్టార్ మూవీ.
Manchu Vishnu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా అమెజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈసినిమాతో సూపర్ స్టార్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోతుందనడంలో ఎటువంటిసందేహం లేదు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈసినిమా 2027 లో రిలీజ్ చేసే టార్గెట్ తో ఉన్నారు. 

Also Read: మహేష్ బాబు తండ్రి పాత్రకు రజినీకాంత్ ను అడిగిన దర్శకుడు ఎవరు? సూపర్ స్టార్ ఏమన్నారంటే?
 

26

ఇక సూపర్ స్టార్ సినిమాలంటేనే రికార్డ్స్ బ్లాస్టింగ్ అవుతుంటాయి. ఏదో ఒక విషయంలో హవా చాటుతుంటాయి. ఈక్రమంలో మహేష్ బాబు నటించని ఓ సినిమా టెలివిజన్ లో వరల్డ్ రికార్డ్ ను నెలకొలిపింది. 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా సరికొత్త ఘనతను సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు అతడు. అవును ఈసినిమా స్టార్ మాలో దాదాపు 1500 సార్లు టెలికాస్ట్ చేశారట. ఇంత వరకూ టెలివిజన్ చరిత్రలో ఇలా ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన సినిమా మరొకటి లేదు. 

Also Read:మోడీ ప్రశంసలు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఇళయరాజా కామెంట్స్ వైరల్

36
Mahesh Babu

మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన సినిమా ఇదే. ఇక స్టార్ మాలో చాలా సందర్భాల్లో అతడు సినిమా ప్లే చేయడం అందరికి తెలిసిందే. ఎన్ని సార్లు ప్లే చేసినా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. మహేష్ బాబు సినిమాలు థియేటర్లో ఆడని సందర్భాలు ఉన్నా కాని అవి  టీటీలో,టెలివిజన్ లో ఎక్కువ గా ఆదరణ పొందుతుంటాయి. 

46

ఈమధ్య వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా అంతే కమర్షల్ గా ప్లాప్ అయినా.. ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసినిమాకు. టీవీలో కూడా మంచి రేటింగ్ సాధించింది ఈసినిమా. ఇక అతడు కూడా అంతే ఎన్ని సార్లు వేసినా..మంచి రేటింగ్ రావడంతో ఎక్కవ సార్లు ఈ సినిమాను టెలికాస్ట్  చేసేవారు. 

56

ఇక అతడు సినిమా విషయానికి వస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మహేష్ బాబు జోడీగా త్రిష నటించింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ , మణిశర్మ మ్యూజిక్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాయి. మహేష్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. రిలీజ్ అయిన కొన్నిరోజుల వరకూ మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న అతడు.. ఆతరువాత అద్భుతం చేసింది. ఇక అప్పట్లో 30 కోట్ల వరకూ వసూళ్ళు సాధించింది సినిమా. ఈసినిమాను రీరిలీజ్ చేయాలని  ఫ్యాన్స్ నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. త్వరలో రీరిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

66
Mahesh Babu and Rajamouli

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ పరుగులు పెడుతోంది. ఈసినిమాకు సబంధించిన షూటింగ్  విజ్యూవల్స్ కాని, ఫోటోలు కాని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. కాని రీసెంట్ గానే షూటింగ్ వీడియో ఒకటి లీక్ అవ్వడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒరిస్సాలో జరుగుతుంది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో స్పందించారు. ఇక్కడ రాజమౌళి షూటింగ్ జరగడం తమకు ఎంత గర్వకారణం అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories