మళ్లీ ప్రేమలో పడ్డ సల్మాన్ ఖాన్ ? ఫామ్‌హౌస్ ఫోటోలు చూసి అభిమానుల షాక్, ఎవరీ కరిష్మా హజారికా?

Published : Jan 24, 2026, 04:32 PM IST

బాలీవుడ్  స్టార్ హీరో  సల్మాన్ ఖాన్  చాలా మంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డారు. ఎంతో మందితో  ఎఫైర్స్ ఉన్నాయని రూమర్స్  కూడా ఉన్నాయి. 60 ఏళ్లు వచ్చినా సింగిల్ గా ఉన్న ఈ స్టార్ హీరో… మరోసారి  ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. 

PREV
14
సల్మాన్ ఖాన్ కొత్త గర్ల్‌ఫ్రెండ్

సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఓ యువతితో కనిపించాడు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో, వారి మధ్య ఉన్న సంబంధంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ అమ్మాయి కరిష్మా హజారికా అని తెలిసింది. ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని ప్రశ్నలు మొదలయ్యాయి.

24
ఎవరీ కరిష్మా హజారికా?

కరిష్మా హజారికా అస్సాంకు చెందిన నటి, మోడల్. ఆమె తన స్టైల్, పర్సనాలిటీతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పాపులర్ అయ్యింది. 'నాగిని 4' సీరియల్‌లో కూడా నటించి గుర్తింపు పొందింది. 

34
ఇన్‌స్టా సెలబ్రిటీ కరిష్మా

కరిష్మా పలు మ్యూజిక్ వీడియోలు, డిజిటల్ ప్రాజెక్టులలో కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, ఫిట్‌నెస్‌పై ఆమె పోస్టులు యువతలో పాపులర్. సల్మాన్ ఖాన్ కు ఆమె పెద్ద అభిమాని అని తెలుస్తోంది. 

44
నెటిజన్ల కామెంట్స్

సల్మాన్ ఫామ్‌హౌస్ ఫోటోలు వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు పెళ్లికి వయసు అడ్డుకాదని సరదాగా కామెంట్ చేయగా, మరికొందరు ఇది స్నేహం మాత్రమే అన్నారు. అయితే కరీష్మా సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీ కోసమే అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోలను ఆమె స్వయంగా తన ఇన్ స్టా లో షేర్ చేసి.. సల్మాన్  ఖాన్ కు బర్త్ డే విష్ చెప్పింది. 

Read more Photos on
click me!

Recommended Stories