హిందీ బిగ్ బాస్ 20వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈ సీజన్ కోసం సల్మాన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ వివరాలు చూద్దాం.
దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' 20వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రతీసారిలాగే ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ దబాంగ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే, షో మొదలవక ముందే సల్మాన్ రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
24
సల్మాన్ రెమ్యునరేషన్ ఎంత?
మీడియా కథనాల ప్రకారం.. ఈ మొత్తం సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు సల్మాన్ ఖాన్ సుమారు రూ.120 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. మొదట్లో (సీజన్ 4) ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్లు తీసుకున్న సల్మాన్, సీజన్ సీజన్‌కు తన పారితోషికం పెంచుకుంటూ వచ్చారు. బిగ్ బాస్ 18 నాటికి ఆయన రెమ్యునరేషన్ రూ.250 కోట్లకు చేరిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు సీజన్ 20కి రూ.120 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
34
నిర్మాతలు ఏమంటున్నారు?
సల్మాన్ రెమ్యునరేషన్ గురించి నిర్మాత రిషి నేగిని అడగ్గా.. నటీనటులతో కాంట్రాక్టులు వ్యక్తిగత విషయమని, వాటిని బయటపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి, రూ.120 కోట్లనేది కేవలం ఒక అంచనా మాత్రమే.
బిగ్ బాస్ సీజన్ 20 గ్రాండ్ ప్రీమియర్ సెప్టెంబర్ 6, 2026న జరగనుంది. ఇది జియో హాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు, కలర్స్ టీవీలో రాత్రి 10:30 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ సీజన్‌లో కరణ్ వాహి, మాహీ విజ్, జన్నత్ జుబైర్, గీతా బస్రా, మిస్టర్ ఫైసూ, మేరీ కోమ్, షోవిక్ చక్రవర్తి వంటి ప్రముఖులు కంటెస్టెంట్లుగా పాల్గొనవచ్చని ప్రచారం జరుగుతోంది. ఫైనల్ లిస్ట్ కోసం ప్రేక్షకులు సెప్టెంబర్ 6 వరకు ఆగాల్సిందే.