SalaarCeaseFire: రెండు పార్ట్ లుగా `సలార్‌`.. `కేజీఎఫ్‌`నే ఫాలో అవుతున్న ప్రశాంత్‌ నీల్‌.. కారణం అదేనా?

Published : Jul 06, 2023, 06:36 AM IST

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `సలార్‌` టీజర్‌ విడుదలైంది. ఈ సినిమా కూడా ముందు నుంచి ఊహించినట్టే రెండు పార్ట్ లుగా రాబోతుంది. అయితే ఇది `కేజీఎఫ్‌`ని పోలి ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. మరి అందుకు కారణం ఏంటనేది చూస్తే..  

PREV
16
SalaarCeaseFire: రెండు పార్ట్ లుగా `సలార్‌`.. `కేజీఎఫ్‌`నే ఫాలో అవుతున్న ప్రశాంత్‌ నీల్‌.. కారణం అదేనా?

`కేజీఎఫ్‌` తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌తో `సలార్‌` మూవీని తెరకెక్కించారు. భారీ కాస్టింగ్‌తో, యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచగా, అప్‌డేట్స్ కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. వారి సుధీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు టీజర్ విడుదల చేశారు. అయితే సినిమా ముందు నుంచి రెండు పార్ట్ లుగా రాబోతుందనే ఊహాగానాలు వినిపించాయి. దాన్ని నిజం చేస్తూ `సలార్‌`ని రెండు పార్ట్ లుగా ప్రకటించారు. `పార్ట్ 1ః కాల్పుల విరమణ`(Part1-CeaseFire) అని వెల్లడించారు.
 

26

చూస్తుంటే ప్రశాంత్‌ నీల్‌ `సలార్‌` విషయంలోనూ `కేజీఎఫ్‌` స్టయిల్‌ని ఫాలో అవుతున్నారనిపిస్తుంది. సినిమా కలర్‌ టోన్‌ నుంచి, సీన్స్ వరకు `కేజీఎఫ్‌`నే తలపిస్తున్నాయి. కేజీఎఫ్‌లోని ఫ్యాక్టరీలే ఇందులోనూ కనిపిస్తున్నాయి. విలన్లు కూడా అదే తరహా కాస్ట్యూమ్స్ ధరించి ఉన్నారు. కత్తులతో యాక్షన్‌ సీన్లు, తుపాకులు, బీజీఎం, ఇంట్రో సీన్లు కూడా `కేజీఎఫ్‌`లాగే ఉన్నాయి. మొదటి పార్ట్ హీరో ఇంట్రడక్షన్‌ కూడా ఇదే స్థాయిలో ఉంది. ఇప్పుడు `సలార్‌` కూడా సేమ్‌ ఉంది. అయితే ఇందులో ప్రభాస్‌ని పూర్తి స్థాయిలో చూపించకపోవడం అభిమానులను కాస్త నిరాశ పరిచే అంశమనే చెప్పాలి. 
 

36

అందుకు కారణాలు వెతికితే.. ప్రశాంత్‌.. `కేజీఎఫ్‌` సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారనేది ఓ విధంగా స్పష్టం. మరోవైపు `సలార్‌` కథకి, `కేజీఎఫ్‌`కథకి సంబంధం ఉందనేది కూడా స్పష్టమవుతుంది. దీంతోపాటు `కేజీఎఫ్‌`లో హీరోని పరిచయం చేస్తూ మరో వ్యక్తి ఎలివేషన్‌ ఇస్తుంటాడు. ఆయన గురించి చెబుతుంటారు. ఇందులోనూ ఓ వృద్ధుడితోనూ చెప్పించారు. అతని గెటప్‌ కూడా సేమ్‌ ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. మరి ఈ రెండింటికి ఇంటర్‌లింక్‌ ని దర్శకుడు ఎక్కడ కలపబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభాస్‌ ఫ్యాన్స్ లోనే కాదు, జనరల్‌ ఆడియెన్స్ లోనూ ఇది క్యూరియాసిటీని తెప్పిస్తుంది. అయితే ఇది రెండు పార్ట్ లుగానే వస్తుందా? లేక పెరుగుతుందా? అనేది కూడా ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 
 

46

ఇక `సలార్‌` సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలకుపైగానే ఉంది. `టీజర్‌`తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారనే చెప్పాలి. ఇకపై వరుసగా అప్‌డేట్లు ఇస్తూ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసేందుకు టీమ్‌ ప్లాన్‌ చేస్తుందట. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం ప్రమోషనల్‌ కార్యక్రమాలు చేయబోతుందట. అందులో భాగంగానే ఇప్పుడు టీజర్‌లో పెద్దగా చూపించలేదని, కేవలం ప్రభాస్‌ జస్ట్ ఎంట్రీని మాత్రమే చూపించారని తెలుస్తుంది. మున్ముందు ఒక్కో అంశం రివీల్‌ చేస్తూ ప్రమోషన్స్ చేయబోతున్నారట. అందుకే ఆ సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

56

ఇదిలా ఉంటే సుమారు 400కోట్ల బడ్జెట్‌తో `కేజీఎఫ్‌`ని నిర్మించిన హోంబలే ఫిల్స్ దీన్ని నిర్మిస్తుంది. `కేజీఎఫ్‌` మొదటి భాగం సుమారు రెండువందల కోట్లు వసూలు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా సంచలనాలు క్రియేట్‌ చేసింది. రెండో పార్ట్‌పై అంచనాలను పెంచింది. ఇక రెండో పార్ట్ ఏకంగా 1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు 400కోట్లతో రెండు భాగాలను రూపొందిస్తున్నారట `సలార్‌` టీమ్‌. ఇప్పుడు మొదటి భాగంతోనే వెయ్యికోట్లకుపైగా కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకున్నారని తెలుస్తుంది. ప్రభాస్‌ మార్కెట్‌ని బట్టి సినిమా బాగుంటే 1500కోట్లు చేసినా ఆశ్చర్యం లేదు. ఇటీవల డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న `ఆదిపురుష్‌` సినిమానే 400కోట్లు వసూలు చేసింది. అదే బాగుంటే దానికి అడ్డే లేదు. 
 

66

అయితే `సలార్‌` కథ పరంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది కోల్‌ మైనింగ్‌ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. అక్కడ దుర్మార్గాలు, అణచివేత నేపథ్యంలో ఓ నాయకుడు పుట్టడం, అణచివేతని అంతం చేసేందుకు ఓ నాయకుడు రావడమనే కథతో సాగుతుందట. కథగానూ `కేజీఎఫ్‌`కి లింకే కనిపిస్తుంది. మరి ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? దానికి దీనికి లింక్‌ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలోనూ తొలుస్తున్న ప్రశ్న. అవన్నీ పక్కన పెడితే.. `బాహుబలి` తర్వాత ప్రభాస్‌కి సరైన కథ పడిందని అనిపిస్తుంది. ఇందులోని యాక్షన్‌ సీన్లు చూస్తుంటే ఆయనలోని నెక్ట్స్ లెవల్‌ హీరోయిజం చూపించేలా ఉంది. మరి సినిమాగా ఇది ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మరో రెండున్న నెలలు వెయింట్‌ చేయాల్సిందే. ఇందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. టీజర్‌లో ఆయన్ని చివర్లో చూపించారు. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories