Tollywood Updates: కళ్యాణ్‌రామ్‌ కొత్త సినిమా, శౌర్య బోల్డ్ కామెంట్, కామెడీతో శ్రీసింహా, అనుష్కతో నవీన్‌ పాట

Published : Jul 05, 2023, 11:25 PM IST

టాలీవుడ్‌లో నయా అప్ డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆడియెన్స్ అని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బుధవారం టాలీవుడ్‌కి సంబంధించి ఆసక్తికర అంశాలతోపాటు అప్‌డేట్స్ పై ఓ లుక్కేద్దాం.

PREV
14
Tollywood Updates: కళ్యాణ్‌రామ్‌ కొత్త సినిమా, శౌర్య బోల్డ్ కామెంట్, కామెడీతో శ్రీసింహా, అనుష్కతో నవీన్‌ పాట

కళ్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా.. ప్రీ లుక్‌ అదిరింది..

కళ్యాణ్‌ రామ్‌ తన పుట్టిన రోజు సందర్బంగా అప్‌డేట్స్ ఇచ్చారు.`డెవిల్‌` టీజర్‌ రిలీజ్‌ చేశారు. దీంతోపాటు తన 21వ చిత్రాన్ని ప్రకటించారు. ప్రదీప్‌ చిలుకూరి అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నారు. అశోక క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ పంచ్‌ విసురుతూ ఉన్నారు. ఆయన చేతికి రక్తం మరకలు ఉన్నాయి. ఇది ఔట్‌ అండ్‌ఔట్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా రూపొందుతుందట. త్వరలో షూటింగ్‌ ప్రారంభమవుతుందట.

24

అనుష్కతో నవీన్‌ పొలిశెట్టి ఆటపాటకి రెడీ..

మరోవైపు.. అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి జంటగా `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి పి మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌, రెండు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా మూడో పాటకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. `లేడీ లక్‌` అంటూ సాగే ఈ పాట ని ఈ నెల 7న విడుదల చేయబోతున్నారు. పోస్టర్‌లో నవీన్‌, అనుష్క అందంగా కనిపిస్తున్నారు. పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో షెఫ్‌ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క, సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్నారు. ఆగస్ట్ 4న సినిమా విడుదల కానుంది. 
 

34

స్క్రిప్ట్ లో డౌట్‌ వస్తే రాజమౌళిని అడుగుతాః శ్రీ సింహా..

ఇక మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించిన `భాగ్‌ సాలే` చిత్రం ఈ నెల 7న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఇది క్రైమ్‌ కామెడీ చిత్రమని, సందేశం ఇవ్వాలని కాదు, మంచి వినోదం పంచాలని ఈ సినిమా చేశామని తెలిపారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌ వల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయని, కాకపోతే ఎక్స్ పోజర్‌ ఎక్కువగా ఉంటుందని, తాము తమ సొంత టాలెంట్‌తోనే నిరూపించుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు శ్రీ సింహా. ఈ సినిమాకి అన్న కాళ భైరవ సంగీతం అందిస్తున్న నేపథ్యంలో ఇద్దరం కలిసి పనిచేయాలని అనుకోలేదని, దర్శకుడే మమ్మల్ని ఎంచుకున్నారని తెలిపారు. ఇక తనకు స్క్రిప్ట్ ఎంపికలో డౌట్స్ వస్తే రాజమౌళి సలహాలు తీసుకుంటానని తెలిపారు. `ఈ సినిమాని కాలేజ్ స్టూడెంట్స్‌కు షోలు వేసి చూపించాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్లకు కూడా చూపించాం. సినిమా బాగుందని చెప్పారు. దాంతో మాకు ఇంకా నమ్మకం పెరిగింది. టీజర్, ట్రైలర్ నచ్చితే సినిమాల మీద జనాలకు ఆసక్తి కలుగుతుంది. ఇంత వరకు నా ఏ సినిమాకు రాని బజ్ ఈ `భాగ్ సాలే`కు వచ్చింది. తెలంగాణ, కేసీఆర్ డైలాగ్ బాగా క్లిక్ అయింది. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల సినిమా బాగా ఆడుతోంది. అది మాకు హెల్ప్ అవుతుంది` అని తెలిపారు. ఈ చిత్రానికి ప్రణీత్ బ్రాహ్మండపల్లి దర్శకత్వం వహించగా, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. నేహా సోలంకి కథానాయిక. 
 

44

రంగా జీవితానికి సంబంధం లేదుః నాగశౌర్య

మీడియా ప్రతినిథులపై స్ఫూప్‌ ఇంటర్వ్యూతో రచ్చ చేశారు నాగశౌర్య. దీంతో ఆయన నటిస్తున్న `రంగబలి` చిత్రానికి మంచి పబ్లిసిటీ వచ్చింది. ఈ చిత్రంపై తాను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు తెలిపారు. గత చిత్రాలను అనుకున్నట్టు ఆడలేదని, కథగా చెప్పినప్పుడు ఒకలా ఉంటే, ఎగ్జిక్యూషన్‌ వరకు మరోలా మారిపోయాయని, దీంతో ఆ సినిమాలు పోతాయని ముందే అర్థమయ్యేదని తెలిపారు. కొంత మంది తమ సినిమాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మిస్‌ ఫైర్‌ అయ్యాయని చెప్పారు. ఈ సినిమాని చూశానని, దీంతో నమ్మకమొచ్చిందన్నారు నాగశౌర్య. ఈ సినిమాకి `రంగా` జీవితానికి సంబంధం లేదని, ఇది పూర్తి భిన్నమైన కథ అని చెప్పారు శౌర్య. షూటింగ్‌లో గాయ పడటంపై చెబుతూ, నేను వచ్చిందే ప్రేక్షకులని మెప్పించడానికి. ఇప్పుడున్న పోటీకి ప్రతి ఒక్కరూ ఎక్స్ టార్డినరిగా యాక్ట్, డ్యాన్స్, యాక్షన్.. అన్నీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మనమూ ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకొక్కసారి గాయాలు అవుతాయి. మనం ఎంచుకున్న వృత్తిలో ఇవన్నీ భాగమే. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. తమ ప్రొడక్షన్‌లో సినిమా ఫ్లాప్‌లపై స్పందిస్తూ, ఏ ప్రొడక్షన్ హౌస్ లో నైనా పది సినిమాలు హిట్లు పడిన తర్వాత కూడా ఒక సినిమా నిరాశ పరిస్తే దాన్ని రికవర్ చేయడం అంత తేలిక కాదు. సినిమా అంటే పిచ్చి ప్యాషన్ తో నిర్మిస్తున్నాం తప్పితే డబ్బులు సంపాయించుకోవాలని కాదు. మాకు సినిమా అంటే పిచ్చి ఇష్టం. మాకు ఇది తప్పితే వేరేది తెలీదు. సత్యతో చేసిన స్ఫూప్‌ ఇంటర్వ్యూలు కాంట్రవర్షియల్‌గా మారుతున్న నేపథ్యంలో వాటిని కట్‌ చేశామని, చాలా వరకు కట్‌ చేయాల్సి వచ్చిందన్నారు. ఎవరినీ హర్ట్ చేయడం తనకిష్టం ఉండదన్నారు. కాకపోతే ఒక ఇంటర్వ్యూ కోసం ఇంతగా వెయిట్‌ చేసిందీ బహుశా తమ ఇంటర్వ్యూకే అని వెల్లడిచారు. కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న `రంగబలి` చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.  యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి `పద పద` అంటూ సాగేరొమాంటిక్ సాంగ్‌ని విడుదల చేశారు. అది వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories