సలార్ రీ-రిలీజ్ కలెక్షన్స్: ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!
ప్రభాస్ నటించిన సలార్ సినిమా రీ-రిలీజ్ లో భారీ వసూళ్లు సాధించింది. మొదటి రోజు 3.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ప్రభాస్ సినిమాల్లోనే రికార్డు సృష్టించింది.
ప్రభాస్ నటించిన సలార్ సినిమా రీ-రిలీజ్ లో భారీ వసూళ్లు సాధించింది. మొదటి రోజు 3.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ప్రభాస్ సినిమాల్లోనే రికార్డు సృష్టించింది.
రెండేళ్ల క్రితం 2023 డిసెంబర్ 22 న విడుదలయిన ప్రభాస్ నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.
ముఖ్యంగా సలార్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి. సలార్ సినిమాలో ప్రభాస్‍తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించింది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించగా రవి బస్రూర్ సంగీతం అందించారు.
ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో సూపర్ హిట్ సినీమాలు రీరిలీజ్ పేరుతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో రెబల స్టార్ అభిమానుల ఎదురుచూస్తున్న సలార్ మరోసారి రిలీజ్ అయింది.
మార్చి 21న సలార్ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగారిలీజ్ చేసారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సలార్ రీరిలీజ్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసారు. సలార్ మ్యానియా మామూలుగా లేదు అనిపించేలా చేసారు. ఇంతకీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి.
ఈ రీ-రిలీజ్ సమయంలో మొదటి రోజు 3.2 కోట్ల రూపాయల గ్రాస్ తో అద్భుతంగా ప్రారంభమైంది. ప్రభాస్ సినిమాల రీ-రిలీజ్ లలో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. సలార్ రీ-రిలీజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు భారీగా ఉన్నాయి. శనివారం కూడా కలెక్షన్స్ అదిరిపోయాయి. ఆదివారం కూడా అలాగే ఉండబోతోంది.
కేవలం సంవత్సరం క్రితం వచ్చిన ఈ సినిమా ఎటువంటి ప్రత్యేక సందర్భం లేకుండా ఇంత భారీ వసూళ్లు సాధించడం నిజంగా అద్భుతమనే చెప్పొచ్చు. ఈ వీక్ తెలుగులో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో సలార్ నే మూవీ లవర్స్ మొదటి ఆప్షన్ గా భావిస్తున్నారు. ఈ నెలలో, SVSC, సలార్ రెండు రీ-రిలీజ్‌లు మంచి విజయాన్ని సాధించాయి.