‘సలార్’కు తప్పని లీకుల బెడద.. ప్రభాస్ మాత్రం మామూలుగా లేడుగా.!

Published : Sep 25, 2022, 04:24 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్  కాంబినేషనల్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సలార్’. ఈ చిత్రాన్ని మొదటి నుంచి సెట్స్ నుంచి లీక్స్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ సెట్ లో ఉండగా మరో వీడియో వచ్చింది.   

PREV
16
‘సలార్’కు తప్పని లీకుల బెడద.. ప్రభాస్ మాత్రం మామూలుగా లేడుగా.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇటీవలనే తను నటిస్తున్న ‘సలార్’ చిత్ర షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ కావడం ఆయన పెద్దనాన్న కృష్ణం రాజు (Krishnam Raju) మరణవార్తను ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న ప్రభాస్ అభిమానులకు కాస్తా రిలీఫ్ ను కలుగజేసింది. 
 

26

‘కేజీఎఫ్’తో సెన్సేషన్ క్రియేట్  చేసిన దర్శకుడు  ప్రశాంత్ నీల్ వెంటనే యంగ్ రెబల్  స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ను ప్రారంభించడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కాంబోలో రూపొందుతున్న హై వోల్టేజీ యాక్షన్ ఫిల్మ్ కోసం ఎదురుచూస్తున్నారు. షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది.

36

అయితే Salaar చిత్ర షూటింగ్ ప్రారంభం నాటి నుంచి చిత్ర యూనిట్ కు లీకుల బెడదతప్పడం లేదు. భారీ సెట్స్ లో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను చీత్రికరిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 20 నుంచి తాజా  షెడ్యూల్ ప్రారంభం కాగా.. 27తో ముగుస్తుంది. కాగా ఈ షెడ్యూల్ షూటింగ్ సెట్ నుంచి లేటెస్ట్ గా ఓ వీడియో బయటికి వచ్చింది. 

46

ప్రస్తుతం న్యూ షెడ్యూల్ లోని సెట్స్ లో చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియో బిట్, ఫొటోలు బయటికి రాకవడంతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లీక్ ల బెడదను కాస్తా పక్కన పెడితే.. తాజాగా లీక్ అయిన ఫొటోస్ మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు. 

56

లేటెస్ట్ గా లీక్ అయిన ఫొటోల్లో ప్రభాస్ లుక్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఈ లుక్ లోని ప్రభాస్ రాజసం చూస్తుంటే ‘ఛత్రపతి’ నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని అభిమానులు తెలుపుతున్నారు. మరోవైపు యాస్ లుక్ తో ప్రభాస్ అదరగొట్టారని నెటిజన్లు, అభిమానులు అంటున్నారు. అయితే ఈ లీక్ ల బెడద మొదటి నుంచి ఉండటంతో ఇకనైనా ఆగిపోతాయని భావించారు. కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

66

ఏదేమైనా ‘సలార్’ కోసం అభిమాలనుతో పాటు దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు అదిరిపోయాయి. చిత్రంలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. ‘కేజీఎఫ్’ నిర్మాత, టెక్నీషియన్సే ఈ మూవీకి పనిచేస్తుండటం విశేషం. ఈ యాక్షన్ ఫిల్మ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories