సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్ 2' సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. మొదటి వారంలోనే భారీ వసూళ్లు రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా తమిళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానానికి చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా జైలర్ 2 సినిమా ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో తమిళ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న రెస్పాన్స్ చూస్తుంటే, త్వరలోనే కోలీవుడ్ నంబర్ 1 సినిమాగా నిలిచేలా కనిపిస్తోంది.
జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్ అప్డేట్స్
అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే జైలర్ 2 సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే ఏకంగా రూ.80 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ క్రేజ్ వల్లే సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజైన మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లు కొల్లగొట్టింది.
23
8 రోజుల్లో రూ.606 కోట్లు రాబట్టిన జైలర్ 2
వీకెండ్‌తో పాటు దసరా సెలవులు కూడా కలిసి రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో మొదటి వారం ముగిసేసరికి ఇండియాలో ఈ సినిమా రూ.391.55 కోట్లు వసూలు చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్లో కూడా 22.6 మిలియన్ డాలర్లు రాబట్టింది. మొత్తంగా మొదటి 8 రోజుల్లో జైలర్ 2 కలెక్షన్లు రూ.606 కోట్లకు చేరుకున్నాయి.
600 కోట్ల క్లబ్లో చేరిన 4వ సినిమా
రిలీజైన మొదటి 8 రోజుల్లోనే 600 కోట్ల క్లబ్లో చేరిన రెండో తమిళ సినిమాగా జైలర్ 2 రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఓవరాల్‌గా తమిళ సినీ చరిత్రలో 600 కోట్ల మార్క్‌ను అందుకున్న నాలుగో సినిమాగా కూడా జైలర్ 2 ఘనత సాధించింది.
33
లియో, కూలీ రికార్డులు గల్లంతు
గతంలో రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా రూ.604 కోట్లు వసూలు చేసింది. అలాగే విజయ్ బ్లాక్‌బస్టర్ మూవీ లియో రూ.605 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డులను బ్రేక్ చేసి జైలర్ 2 రెండో స్థానానికి ఎగబాకింది. ఇక రజినీకాంత్ కూలీ సినిమా రూ.518 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
2.O రికార్డును బ్రేక్ చేసే దిశగా జైలర్ 2
తమిళ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా శంకర్ డైరెక్ట్ చేసిన 2.O మొదటి స్థానంలో ఉంది. రజినీకాంత్, అక్షయ్ కుమార్ కలిసి నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.691 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం జైలర్ 2 వసూళ్ల స్పీడ్ చూస్తుంటే, త్వరలోనే 2.O రికార్డును బ్రేక్ చేసి నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించేలా ఉంది.