Sakala Gunabhi Rama : ‘సకల గుణాభి రామ’ మూవీ రివ్యూ.!

First Published Sep 16, 2022, 6:27 PM IST

‘బిగ్ బాస్’ ఫేం వీజే సన్నీ (VJ Sunny) నటించిన  తొలిచిత్రం ‘సకల గుణాభి రామా’. ఈ రోజు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సినిమా కథ, సన్నీ పెర్ఫాామెన్స్, తదితర అంశాలను ‘రివ్యూ’లో తెలుసుకుందాం.

‘బిగ్ బాస్’ ఫేం వీజే సన్నీ (VJ Sunny) నటించిన  తొలిచిత్రం ‘సకల గుణాభి రామా’. ఈ రోజు గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మాత సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ సంగీతం అందించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని నెలకొల్పాయి. అసిమా, శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ. చమ్మక్ చంద్ర,  తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా.. బిలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా వీజే సన్నీ కనిపించాడు. మూవీలో సన్నీ  పెర్ఫామెన్స్, సినిమా కథేంటి..  ఆడియెన్స్ ను ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథ : అభి రామ్ (విజే సన్నీ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో తక్కువ జీతానికే పనిచేస్తూ ఉంటాడు.  బిలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా జీవనం సాగిస్తూ వుంటాడు. స్వాతి (అషిమా)ని ప్రేమించి పెళ్లాడుతాడు. అయితే వచ్చే జీతం చాలక.. వడ్డీ వ్యాపారం చేసే ప్రదీప్ (శ్రీ తేజ్) వద్ద అప్పు తీసుకుని.. వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతుంటాడు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా... రామ్ భార్య స్వాతి సంతానం వొద్దని... సేఫ్టీ వాడుదాం అని చెబుతూ పిల్లలని కనడం వాయిదా వేస్తూ వుంటుంది. ఈ క్రమంలో ఓ సారి భార్య మీద అఘాయిత్యం కూడా చేస్తాడు. దాంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది. మరి అలా వెళ్లిన స్వాతి తిరిగి వచ్చిందా? ఆమె పుట్టింటికి వెళ్లిపోయిన తరువాత రామ్ ఏమి చేశాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

కథ, విశ్లేషణ : ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి... చాలీ చాలని జీతం. అలాంటి యువకుని జీవితంలో జరిగే ఘటనలు, ఇబ్బందులు నేటి యువతకి చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి. బాగా కనెక్ట్ అవుతాయి.  రచయిత, చిత్రం దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ ఈ బేస్ పాయింట్ తో మంచి ఫన్ ఎలిమెంట్స్ ను అందించే ప్రయత్నం చేశాడు. కానీ పెద్దగా పండలేదనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా.. హీరో పనిచేసే కంపెనీలో సహా ఉద్యోగులతోనూ, యజమానితోనూ నార్మల్ సన్నివేశాలతో సాగుతుంది. ఇంటర్వెల్ తరువాత పరాయి స్త్రీతో పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కాస్తా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని వల్ల నేర్చుకునే గుణపాఠం.. తదితర విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రేమ వివాహం చేసుకోవడమే కాదు, పొరపాట్లు జరిగితే క్షమించే గుణం కూడా భార్యాభర్తలకు వుండాలంటూ మేసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సన్నివేశాలను తెరకెక్కించడంలో దర్శకుడు కాస్తా తడబడ్డాడని చెప్పొచ్చు. దర్శకత్వంలో పస లేదని తెలుస్తోంది. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా నాసిరకంగా ఉన్నాయి. 

హీరో వి.జె.సన్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగి గా... ఓ చిలిపి భర్తగా కనిపించాడు. సన్నీకి ఇది మొదటి చిత్రం కావడంతో కాస్తా ఆందోళన కనిపించింది.  కామెడీ, ఎమోషన్ సీన్స్ ల్లో అదరగొట్టినా అక్కడక్కడా జోష్ కోల్పోయాడు. అయినప్పటికీ వంద శాతం బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సాంగ్స్, డ్యాన్స్ లో అదరగొట్టారు. నటీనటుల మధ్య  కెమిస్ట్రీ కాస్తా వర్కౌట్ అయ్యిందనిపించేలా నటించారు. హీరోయిన్ అషిమ పాత్రకి తగ్గట్టుగా నటించింది. విలన్ భార్య గా దీపిక... పాత్రలో నటించిన తరుణీ సింగ్ తన బబ్లీ నటనతో ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఆమెతో హీరో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వడ్డీ వ్యాపారి ప్రదీప్ పాత్రలో శ్రీతేజ్ కనిపించారు. సెవెన్ ఆర్ట్స్ సరయు బోల్డ్ పాత్రలో యుత్ ని అట్రాక్ట్ చేసింది. విట్టా మహేష్ కామెడీ ట్రాక్ ఫర్వాలేదనిపిస్తోంది. 

దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మంచి కథ.. కథనాలను రాసుకున్నప్పటికీ అవుట్ పుట్ లో కాస్తా తేడా కొట్టినట్టు కనిపిస్తోంది. మరింత బాగా దాన్ని తెరమీద ఆవిష్కరించి వుంటే మంచి సినిమా అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాణ విలువలు కూడా  క్వాలిటీగా ఉండాల్సింది. అయితే చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లోనూ  యూనిట్ ఇంకాస్తా జోరు పెంచితే బాగుండేది. చాలీచాలని ప్రమోషన్ తో డైరెక్ట్ గా సినిమాను విడుదల చేయటంతో ఫలితం ఊహించిన దానికి భిన్నంగా ఉంది. సినిమా ఫలితంపై గట్టి నమ్మకం లేకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

click me!