కాకపోతే కొన్ని రోజులు ఐసియులో పరిశీలనలో ఉంచాలని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి సంఘటనతో అతడి కుటుంబ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ వయసు ప్రస్తుతం 54 ఏళ్ళు. ఐదు పదుల వయసులో కూడా సైఫ్ ఫిట్ గా ఉంటూ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఆదిపురుష్, ఎన్టీఆర్ దేవర చిత్రాల్లో సైఫ్ నెగిటివ్ పాత్రల్లో నటించారు.