పీరియడ్స్‌ అన్నా పట్టించుకోరు,షూట్ చెయ్యాల్సిందే : నిత్యామీనన్‌

Published : Jan 17, 2025, 11:18 AM IST

 మనస్సులో ఏమీ దాచుకోకుండా మాట్లాడే నిత్య  ఈ మధ్య కాలంలో తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఆమె  సినిమా పరిశ్రమపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

PREV
16
 పీరియడ్స్‌ అన్నా పట్టించుకోరు,షూట్ చెయ్యాల్సిందే : నిత్యామీనన్‌
Actress Nithya Menen


నటిగా నిత్యామీనన్ కు వీరాభిమానులు ఉన్నారు. అయితే ఆమె చాలా సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుని ముందుకు వెళ్తూంటుంది.  హీరోయిన్ గా నిత్యామీనన్  కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ్ ఇండస్ట్రీలలో దూసుకుపోతోంది.

‘అలా మొదలైంది’ సినిమా ద్వారా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె. మొదటి సినిమా హిట్ కావడంతో వరుస అవకాశాలు లభించాయి. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఎన్టీఆర్ (NTR), నాని (Nani) లాంటి స్టార్ హీరోల తరఫున నటించి మెప్పించింది ఈమె.
 

26


తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం సినిమాలలో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకున్న నిత్యా వరస సినిమాలు ఇప్పటికీ చేస్తోంది.  ధనుష్‌ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు.

ఆమె డియర్‌ ఎక్సెస్‌ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్‌ సేతుపతితో కలిసి నటిస్తోంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా తెలుగింటి ఆడపిల్లల పాత్రలు చేసే ఈ ముద్దుగుమ్మ   ఎలాంటి పాత్ర అయినా ఛాలెంజింగ్ గా  చేయడానికి రెడీ అవుతోంది. మనస్సులో ఏమీ దాచుకోకుండా మాట్లాడే నిత్య  ఈ మధ్య కాలంలో తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఆమె  సినిమా పరిశ్రమపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

36
Nithya Menon abou Dhanushs film Idly Kadai


 నిత్యా మీనన్‌(Nitya Menen ) ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్‌ కార్యక్రమంలో నిత్యామీనన్‌  బిజీ బిజీగా ఉంది.  అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  

ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బెట్టింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం.  

46


నిత్యామీనన్ మాట్లాడుతూ...చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్‌ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని  ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్‌కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.

56

నిత్యా 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత  అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్‌లోనే తనకు పీరియడ్స్‌ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్‌ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని  కూడా నిత్య తెలిపింది.   నాకు పీరియడ్స్‌ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను.
 

66


 అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే..  ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని  ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్‌ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్‌ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.
 

click me!

Recommended Stories