'రాజా సాబ్ ' రిలీజ్ ఎప్పుడు, లేటుకు కారణం ఏమిటి?

Published : Jan 17, 2025, 11:35 AM IST

క్లైమాక్స్ లో చాలా గ్రాఫిక్స్,విఎఫ్ ఎక్స్ వర్క్ ఉంటుందని, దానిపై చాలా ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కల్కి రిలీజ్ దాకా ఈ సినిమా విషయాలు దాచి పెడతారని ఆ సినిమా తర్వాతే రివీల్ చేస్తారని అంటున్నారు.

PREV
16
 'రాజా సాబ్ ' రిలీజ్ ఎప్పుడు, లేటుకు కారణం ఏమిటి?
The Raja Saab Prabhas film update out

ప్రభాస్ తాజ-ా చిత్రం “రాజా సాబ్” పై బజ్ పెరుగుతూ వస్తోంది. దానికి తోడు నార్త్ లో హారర్ కామెడీ చిత్రాలు క్లిక్ అవ్వటంతో అక్కడ కూడా మంచి బిజినెస్ అవుతోంది . అలాగే రీసెంట్ గా   ఈ చిత్రం సంక్రాంతి లుక్ రిలీజ్ చేసి  క్రేజ్ స్టార్ట్  అయ్యింది. అప్పటిదాకా ప్రభాస్, మారుతి కాంబినేషన్ ఏంటి అని పెదవి విరిచిన వాళ్లు ఒక్కసారిగా ఎలర్ట్  అయ్యారు. రాజా సాబ్ పోస్టర్ లో .. డార్లింగ్ లుక్ ని చూసిన అభిమానులు.. ఈ సినిమాపై మరింత ఎక్సపెక్టేషన్స్ పెంచుకుంటున్నారు.

26
The Raja Saab Prabhas film update out


 అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పోస్టర్ తప్ప .. ఇక ఏ అప్ డేట్స్ లేవు. పైగా ఈ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు వినిపించాయి.   ఈ క్రమంలో సినిమా రిలీజ్ గురించిన చర్చ మొదలైంది.  అందుతున్న సమాచారం మేరకు రాజాసాబ్ చిత్రం  VFX వర్క్ పెండింగ్ ఉంది. మొదట ఈ చిత్రం ఏప్రియల్ 10 వస్తుందని ప్రకటన ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ డేట్ కు వచ్చే పరిస్దితి కనపడటం లేదు. సంక్రాంతి రోజు కొత్త రిలీజ్ డేట్ తో పోస్టర్ వస్తుందనుకుంటే అదీ జరగలేదు. 

36
The Raja Saab Prabhas film update out

ఎప్పుడు రాజా సాబ్ రిలీజ్ అంటే జూలై ఆఖరు వారంలో ఈ చిత్రం రిలీజ్ మాగ్జిమం ఉండే అవకాసం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.  ఆ మేరకే టీమ్ రాత్రింబవళ్లు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ తప్పించి మిగతావి ఫినిష్ చేస్తున్నారు. అలాగే సినిమాలో ఎక్కువ సీజీ వర్క్  ఉందని ఆ సీన్స్ కూడా పూర్తి చేసేసి ఎప్పుటికప్పుడు అవుట్ ఫుట్ ని పర్యవేక్షిస్తున్నట్లు  తెలుస్తోంది 

46
The Raja Saab Prabas film updates out

 చిత్రం కథ విషయానికి వస్తే ..

 “రాజా సాబ్” చిత్రం రజనీకాంత్ సూపర్ హిట్ చంద్రముఖి తరహాలో ఉండబోతోందిట. హారర్ కామెడీగా రూపొందే ఈ చిత్రం కథ,గెటప్ వంటి విషయాల్లో చంద్రముఖి కు సంభందం లేకుండా ఫార్మెట్ మాత్రం అలాగే ఉంటుందంటున్నారు. రాజా సాబ్ లో దెయ్యాలు ఉంటాయని, అక్కడ చంద్రముఖి బిల్డింగ్ లో కథ జరిగినట్లుగానే ఇక్కడ ఓ థియేటర్ లో కథ జరుగుతుందని అంటున్నారు. అలాగే ప్లాష్ బ్యాక్ కథకు కీలకంగా నిలుస్తుందని తెలుస్తోంది. క్లైమాక్స్ లో చాలా గ్రాఫిక్స్,విఎఫ్ ఎక్స్ వర్క్ ఉంటుందని, దానిపై చాలా ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

56
Prabhas, The Raja Saab, maruthi


 ఏదైమైనా హారర్ కామెడీ జానర్ లో రెడీ అవుతున్న ది రాజా సాబ్(The Raja Saab)  ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది .  లోకల్ ఆడియన్స్ కి ఒకప్పటి ప్రభాస్ మిస్టర్ పెర్ఫెక్ట్, మిర్చి లాంటి… టచ్ ఉన్న కమర్షియల్ మూవీ ని ఇవ్వలేక్ పోయాడు….సలార్(Salaar) బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపినా కూడా వింటేజ్ ప్రభాస్ అయితే ఇంకా తిరిగి రాలేదు…

ఇలాంటి టైంలో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా మూవీని అనౌన్స్ చేయగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి అఫీషియల్ గా..వింటేజ్ లుక్ తో రావటం మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.  డైనోసార్‌.. పక్కా డార్లింగ్‌గా ట్రాన్స్ ఫర్మేషన్‌ అయిన సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా మన ముందుకు తీసుకురాబోతోంది.
 

66
Prabhas, The Raja Saab, maruthi


'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు.
 
 

Read more Photos on
click me!

Recommended Stories