ఎగ్జామ్‌ పేపర్‌లో ఆన్సర్‌కి బదులు ఏం రాసిందంటే.. సీక్రెట్‌ రివీల్ చేసిన నటి

First Published Jul 6, 2020, 12:05 PM IST

లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో ప్రజలు సెలబ్రిటీలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన పాత వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా సారా అలీఖాన్‌ తన తల్లి గురించి గతంలో చేసిన కొన్నికామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

లాక్‌డౌన్‌ సమయంలో సారా అలీ ఖాన్‌ పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ఈ సమయంతో తల్లి అమృత సింగ్‌, సోదరుడు ఇబ్రహీంతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే వరకు కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించిన ఈ బ్యూటీ తన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
undefined
ఈ సందర్భంగా సారా తన తల్లి అమృత సింగ్‌ గురించి ఆసక్తికర విషయం వెల్లడించింది. తన తల్లి బోర్డ్ ఎగ్జామ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ను అభిమానులతో పంచుకుంది సారా.
undefined
తన తల్లి బోర్డ్‌ ఎగ్జామ్‌ లో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయకుండా కేవలం పేపర్ మీద ఐ లవ్‌ అమృతా సింగ్ అని రాసి బయటకు వచ్చిందట. అయితే ఈ పేపర్‌ తనకు ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయని మీరు భావిస్తున్నారు అని వ్యాఖ్యతను ప్రశ్నించింది సారా.
undefined
సారా తల్లి దండ్రులు సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్‌ను దిల్లగీ సినిమా షూటింగ్ సెట్‌లో కలిశారు. ఈ సినిమా సమయంలో అమృత సీనియర్‌ ఆర్టిస్ట్‌ కాగా, సైఫ్‌ అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
undefined
మూడు నెలల పరిచయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సైఫ్, అమృతలు తల్లి దండ్రులకు తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నారు. సైఫ్ కన్నా అమృత 13 సంవత్సరాలు పెద్దది కావటమే అందుకు కారణం.
undefined
వీరిద్దరికి సారాతో పాటు ఇబ్రహీం అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే అమృతతో విడిపోయిన తరువాత స్విస్ మోడల్‌ రోసాతో కొంత కాలం డేటింగ్ చేశాడు సైఫ్, ఆమెతోనూ బంధం కొనసాగకపోవటంతో తరువాత కరీనాను పెళ్లి చేసుకున్నాడు.
undefined
తన కన్నా వయసులో 10 సంవత్సరాలు చిన్నదైన కరీనాను 2012 అక్టోబర్ 16న వివాహం చేసుకున్నాడు సైఫ్‌. తన మొదటి భార్య సైఫ్ కన్నా 13 ఏళ్లు పెద్దది కాగా రెండో భార్య 10 ఏళ్లు చిన్నది. 13 ఏళ్ల పాటు కలిసున్న తరువాత మొదటి భార్య అమృత నుంచి విడాకులు తీసుకున్నాడు సైఫ్‌.
undefined
విడాకుల సమయంలో భరణంగా భారీ మొత్తాన్నే చెల్లించాడు సైఫ్‌. 5 కోట్లు భరణంగా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న సైఫ్, ముందుగా 2.5 కోట్లు ఇచ్చాడు. తరువాత అంతేకాదు పిల్లల సంరక్షణ కోసం ప్రతీ నెల లక్ష రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు.
undefined
click me!