ఈ సందర్బంగా మరో క్రేజీ విషయాన్ని వెల్లడించింది అనసూయ. తాను పోయిన జన్మలో జింకనో, మేకనో అయి ఉంటాను. అందుకే గ్రీనరీతో ఆ అనుబంధం ఉంటుందని చెప్పింది అనసూయ. తాను మణికొండలో ఉంటుందని, ఒకప్పుడు అక్కడ అంతా గ్రీనరీ, కొండలు ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు పొడుగుపొడుగు బిల్డింగ్‌లు వచ్చి, ఆ ప్రకృతిని నాశనం చేశామని తెలిపింది. హైదరాబాద్‌లో సహజంగా మెట్ట ప్రాంతమని, వరదలు వచ్చే పరిస్థితి లేదని, కానీ మనం తెలివితేటలతో చేసిన పనులకు ఇప్పుడు అన్నీవిపత్తులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది అనసూయ.