హాట్ టాపిక్ గా సాయి పల్లవి చీర ధర... తెలిస్తే మైండ్ బ్లాకే!

First Published Apr 5, 2021, 8:42 AM IST

లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్స్ కోసం సాయి పల్లవి ధరించిన చీర హాట్ టాపిక్ గా మారింది. స్కై బ్లూ కలర్ కలిగిన ఆర్గాన్జా శారీలో సాయి పల్లవి గ్రాండ్ గా కనిపించారు. సాయి పల్లవి మేని ఛాయకు సరిపోయేలా ఉన్న శారీకి అంచున ఫ్లోరల్ ప్రింట్ మరింత రిచ్ నెస్ సమకూర్చింది. 
 

ఇక సాయి పల్లవి ధరించిన స్లీవ్ లెస్ జాకెట్... ఆమెను సరికొత్తగా ప్రజెంట్ చేసింది. సాయి పల్లవి ధరించి ఆ శారీ ధర తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే.  సాయి పల్లవి ధరించి ఆ చీర్ ఖరీదు ఏకంగా లక్ష రూపాయలు అని సమాచారం. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే సాయి పల్లవి, ఇలాంటి ఖరీదైన చీరలు ధరించడం చాలా అరుదు.
undefined
ఇక మేకప్ కూడా లేకుండా సహజంగా నటించే హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. ఈ న్యాచురల్ బ్యూటీ ప్రత్యేకతల్లో ఇది కూడా ఒకటి. పాత్ర ఏదైనా మితిమీరిన మేకప్  వేసుకోరు ఆమె.
undefined
కాగా సాయి పల్లవి నటించిన రెండు చిత్రాలు ఏప్రిల్ నెలలో విడుదల కావడం విశేషం. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీ ఏప్రిల్ 16న విడుదల కానుంది.
undefined
ఈ చిత్రంలోని సారంగ దరియా సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్ బద్దలు కొడుతుండగా, సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
undefined
అలాగే రానా హీరోగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. 90ల నాటి కథలో సాయి పల్లవి నక్సలైట్ ప్రేమలో పడ్డ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్నారు.
undefined
click me!