డబ్బు కోసం సినిమాలు చేయను.. ఉపాధినివ్వడం కోసం చేస్తాః పవన్‌ కళ్యాణ్‌

Published : Apr 04, 2021, 11:47 PM IST

తాను డబ్బులు సంపాదించడం కోసం సినిమాలు చేయడం లేదని, అవినీతి లేకుండా, వందల మందికి ఉపాధిని ఇవ్వడం కోసం సినిమాలు చేస్తున్నానని చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. ఆయన నటించిన `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్, స్త్రీలు, రాజకీయాలు, సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు.   

PREV
126
డబ్బు కోసం సినిమాలు చేయను.. ఉపాధినివ్వడం కోసం చేస్తాః పవన్‌ కళ్యాణ్‌
పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా, వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన `వకీల్‌సాబ్‌` చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది.

226
ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.

326
ఇందులో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, `నిర్మాత దిల్‌రాజు నాతో సినిమా చేయాలని 22ఏళ్లుగా వెయిట్‌ చేస్తున్నానని చెప్పడం ఆనందంగా ఉంది. అలాంటి ప్యాషన్‌ ఉన్న నిర్మాతతో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను కలలు కనే వాడిని ఇష్టపడతాను. కలలు సాధించాలనుకునే వారిని గౌరవిస్తాను. దిల్‌రాజుని ఈ విషయం అభినందిస్తున్నా` అని చెప్పారు.

426
వేణు శ్రీరామ్‌ గురించి చెబుతూ, `కింది స్థాయి నుంచి వచ్చిన వారంటే నాకు గౌరవం. ఎక్కడో తెలంగాణలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వేణు శ్రీరామ్‌ డిగ్రీ చదువుతు, సుద్దాల వద్ద శిష్యుడిగా ఉండి, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. ఇది ఆయన స్వశక్తితో సంపాదించుకున్నారు. ఆయన కష్టానికి, ప్రతిభకి దక్కిన గౌరవమన్నారు.

526
తనకు కష్టసుఖాలు తెలుసని చెప్పాడు పవన్‌. ఎక్కడో ఉంటూ తపస్సు చేసుకోవడం కంటే బయటకు వచ్చి స్వతహాగా ఎదిగి, కష్టనష్టాలు చూసి సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి చెప్పిన మాటలను గుర్తు చేశారు పవన్‌. ఒకరిపై ఆధారపడి కాకుండా సొంతంగా ఎదిగి ఏదైనా చెబితే జనాలు వింటారు, అలా ఎదిగి చూపించూ అన్నారని దాని వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పాడు పవన్‌.

626
ఈ సందర్భంగా తాను ఇంటర్‌ సెకండియర్‌ రెండుసార్లు ఫెయిల్‌ అయినట్టు చెప్పాడు. దీంతో చదువుని మధ్యలోనే వదిలేశానని, కానీ పుస్తకాలతో సమాజాన్ని చదివానని చెప్పాడు. పుస్తకాలు ఎంతో నేర్పించినట్టు చెప్పాడు.

726
సినిమా గురించి చెబుతూ, త్రివిక్రమ్‌ వల్ల ఈ సినిమా చేసే అవకాశం వచ్చిందన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో మానవ హక్కులు ఉల్లంఘణ జరిగినప్పుడు లాయర్‌ రాణి పాంకివాల్‌ మానవ హక్కులపై పోరాడారని, బలంగా వాధించారని గుర్తు చేశారు. అలా లాయర్‌ వృత్తిపై గౌరవం ఏర్పడిందన్నారు. తాను ఈ పాత్ర చేయడం అదృష్టమన్నారు.

826
భారత్‌ మాతాకి జై అని చెప్పి స్త్రీలపై కామెంట్‌ చేయడం, దాడులు చేయడం కరెక్ట్ కాదని, అది దేశభక్తి కాదన్నారు. ప్రతి ఒక్కరు స్త్రీలని గౌరవించాలని చెప్పారు. తమ కుటుంబంలో అందరం స్త్రీలను గౌరవిస్తామని చెప్పారు. స్త్రీశక్తిని, ఆది శక్తిగా భావిస్తానని చెప్పారు. ఈ సినిమా ద్వారా ఆడపిల్లలకు తామిచ్చే గౌరవం, తమ వంతు చేస్తున్న కృషి అన్నారు.

926
ప్రకాష్‌ రాజ్‌ని నటుడుగా తాను బాగా ఇష్టపడతానని చెప్పాడు. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టమన్నారు. అలాగే అంజలి, నివేదా, అనన్య అద్భుతంగా నటించారని చెప్పాడు. అయితే తనకు ఐటెమ్‌ సాంగ్‌లు చేయడం, స్త్రీలను కించపరిచేలా చేయడం ఇష్టం ఉండదన్నారు. సాధ్యమైనంత వరకు ఐటెమ్‌ సాంగ్‌లకు దూరంగా ఉంటానని చెప్పాడు. ఈ సందర్భంగా `కెవ్వు కేక` పాటని కూడా బలవంతంగా చేశానని తెలిపారు.

1026
ఈ క్రమంలో అభిమానులు సీఎం సీఎం అని అరుస్తుండగా, సీఎం కావాలని ఉంది. దాన్ని సాధించాలన్నారు. అయితే తాను పదవుల కోసం వెంపర్లాడనని, కష్టపడుతూ, ప్రజలకు సేవ చేస్తూ వెళ్తానని తెలిపారు. ఈ క్రమంలో అవి వస్తే ఆహ్వానిస్తామన్నారు. అయితే తనని కొందరు పొగరు అనుకుంటారని, సినిమాలు తక్కువ చేస్తానని అందుకే పొగరు అంటారు. పొగరంటే ఇతరులకు హాని చేయడం, కొట్టడం, హింసించడం చెడు పనులు చేయడమని, తాను తన జీవితాన్ని జీవిస్తున్నానని ఎవరికీ హాని చేయడం లేదన్నారు.

1126
అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, వాళ్లు లేకపోతే తాను లేనని చెప్పాడు పవన్‌. వాళ్ల మనసు తనకు తెలుసని, వారిని ఎంటర్‌టైన్‌ చేసేందుకు కష్టపడి పనిచేస్తానని,సినిమాని ఆదరించాలని తెలిపారు. తాను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదని, ఉపాధి కోసం చేస్తున్నానని అన్నాడు. సినిమా చేయడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

1226
ఈ సినిమాకి పెద్ద దర్శకులతో చేయొచ్చు, కానీ సినిమాని, హీరోలను అభిమానించే దర్శకులతో సినిమా చేస్తానని చెప్పారు. అలాంటి వారు సినిమా చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. తాను తనతో సినిమాలు చేయనని ఎవరినీ యాచించలేనని, వచ్చిన సినిమాలు చేస్తానని చెప్పాడు పవన్‌.

1326
`వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ స్పీచ్‌ దృశ్యాలు.

1426

1526
ఈ ఈవెంట్‌లో డ్రమ్మర్‌ శివమణి వద్దకి వెళ్లి కాసేపు సరదాగా డ్రమ్‌ వాయించారు. ఇది హైలైట్‌గా నిలిచింది.

1626
`వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌.

1726

1826

1926

2026

2126

2226

2326

2426

2526

2626

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories