ఏరా మీ బాస్ సినిమాలు అంటాడు రాజకీయం అంటాడు... బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Apr 5, 2021, 8:12 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం వకీల్ సాబ్ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గా మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తో పాటు దర్శక నిర్మాతలు, నటీనటులు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది. 

ఇక పవన్ భక్తుడుగా చెప్పుకొనే బండ్ల గణేష్ వేదికపై మాట్లాడుతూ మరోమారు తన అభిమానం చాటుకున్నారు. ఆయన మాట్లాడుతూ...  ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా...పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే వదలలేం. కొందరిని ఇష్టపడటమే గానీ వదులుకోవడం ఉండదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి మీరు పదో తరగతి బాగా పాసయ్యారు అంటే కింద నుంచి పై దాకా చూస్తారు. పవన్ గారికి హిట్స్, సూపర్ హిట్స్ అంతే. ఆయన చూడని విజయాలా, ఆయన సాధించని రికార్డులా, ఆయన చూడని బ్లాక్ బస్టర్లా, ఆయన సృష్టించని చరిత్రలా, ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం అంతే.
undefined
పవన్ గారు కొత్త చరిత్ర కోసం అడుగులు వేస్తున్నారు. ఇటు సినిమాలూ చేస్తున్నారు. చేయాలి కూడా. ఒక ఫ్రెండ్ నాతో అన్నాడు ఏరా మీ బాస్ సినిమాలు అంటాడు రాజకీయం అంటాడు అని. నేను చెప్పాను. ఒరేయ్ ఆయనకు మనలా పాల వ్యాపారం, మందు వ్యాపారం, కోళ్ల వ్యాపారం ఇలాంటివేవీ తెలియదు. ఆయనకు తెలిసిందల్లా బ్లడ్ వ్యాపారం. రక్తాన్ని చెమటగా మార్చి, ఆ చెమటతో నటించి మనకు సంతోషాన్ని కలిగిస్తుంటారు అన్నాను.
undefined
కష్టాల్లో ఉన్న వారికి తను చెమటోడ్చి సంపాదించిన కోటి రూపాయలతో ఇన్సురెన్స్ చేయించిన గొప్ప వ్యక్తి ఆయనరా అని నా ఫ్రెండ్ ను తిట్టాను. పవన్ గారి నిజాయితీ ఏంటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. అంజనీ పుత్ర పవన సుతనామ అని ఊరికే అనలేదు. చాలా మంది పుడతారు గిడతారు. కొందరే చరిత్రలో మిగిలిపోతారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ సినిమా వెనక సినిమా చేస్తూ ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అదీ పవన్ కళ్యాణ్.
undefined
పవన్  గారికి ఏదో ఒకటి చెప్పి బుట్టలో వేద్దాం అని వెళ్తాను. ఆయన దగ్గరకు వెళ్లి ఆయన కళ్లు చూడగానే అన్నీ మర్చిపోతాను. ఆ కళ్లలో అంత నిజాయితీ ఉంటుంది. నేను నిజంగా పవన్ కళ్యాణ్ భక్తుడినే. ఏడుకొండల వాడికి అన్నమయ్య, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవర్ స్టార్ కు బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా.
undefined
పవన్ గారికి పొగరు అన్న ఓ వ్యక్తికి...పాక్ గడ్డమీద ఆ సైనికులకు దొరికి చిత్ర హింసలు పెట్టినా మన దేశ రహస్యాలు చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసం కట్టుకున్నంత పొగరు పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పా. చైనాతో యుద్ధంలో ఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికి ఉన్నంత పొగరు ఉందని చెప్పా. ఛత్రపతి శివాజీ కత్తికి ఉన్న పదునంత పొగరు అని చెప్పా.
undefined
బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా దించేసి, ఎర్రకోట మీద ఎగిరిన మువ్వన్నెల జెండాకున్నంత పొగరుందని చెప్పా. భారత రాజ్యాగంలో అంబేద్కర్ చేతి రాతకున్నంత పొగరుందని చెప్పా. యవ్వనంలో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తిలో ఉన్నంత పొగరుందని చెప్పా. పరశురాముడి గొడ్డలికున్నంత పదును, శ్రీరాముడు విడిచిన బాణంలోని పదునంత పొగరుందని చెప్పా.
undefined
శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంలోని పదునంత పొగరుందని చెప్పా. అన్నింటికంటే జై పవర్ స్టార్ అని అరిచే అభిమాని గుండెకున్నంత పొగరుందని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. అన్నారు.
undefined
click me!