Sai Pallavi: సాయిపల్లవికి, మిగిలిన హీరోయిన్లకి ఉన్న తేడా అదే.. ఆమెని సూపర్‌స్టార్‌ని చేసిన అరుదైన లక్షణాలు..

Published : May 09, 2022, 01:12 PM ISTUpdated : May 09, 2022, 02:08 PM IST

సాయిపల్లవి అంటే సహజమైన అందానికి, సహజమైన నటనకు, సహజమైన డాన్సులకు కేరాఫ్‌. అంతేకాదు ఆమెలోని ఓ క్వాలిటీస్‌ కూడా అంతే సహజంగా ఉండటం విశేషం. ఇతర హీరోయిన్లతో సాయిపల్లవి ప్రత్యేకంగా నిలిచే కారణాలు చూస్తే. 

PREV
16
Sai Pallavi: సాయిపల్లవికి, మిగిలిన హీరోయిన్లకి ఉన్న తేడా అదే.. ఆమెని సూపర్‌స్టార్‌ని చేసిన అరుదైన లక్షణాలు..

సాయిపల్లవి(Sai Pallavi) కమర్షియల్‌ హీరోయిన్‌ కాదు. ఆమె అందాలు ఆరబోయదు. మిగిలిన హీరోయిన్ల మాదిరిగా పొట్టి దుస్తులేయదు, లెహంగా ఓణిలో కనిపిస్తుంది. కానీ అందరి కంటే అందంగా ఉంటుంది సాయిపల్లవి. అందాలు ఆరబోసే కమర్షియల్‌ హీరోయిన్లకంటే చీరలో, హాఫ్‌ శారీలో ఆమె అందం తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. అలా సాయిపల్లవిని చూసిన ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. సహజమైన అందాలకు కేరాఫ్‌ సాయిపల్లవి. ఆమె మేకప్‌ కూడా తక్కువే వాడుతుంది. రియల్‌గానే ఎంతో క్యూట్‌గా ఆకట్టుకుంటుందీ మల్లు బేబీ. ఇతర హీరోయిన్లు తెరపై అందంగా కనిపించేందుకు మేకప్‌తో రెచ్చిపోతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం చాలా తక్కువగా వాడుతుందని టాక్‌. 

26

సాయి పల్లవి డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. సౌత్‌లో మరే హీరోయిన్‌ కూడా ఈ రేంజ్‌లో డాన్సులు చేయలేరంటే అతిశయోక్తి కాదు. సాయిపల్లవిని మించి డాన్సు చేసే హీరోయిన్‌ లేదంటేనూ అతిశయోక్తి కాదు. సహజమైన డాన్సులతో ఆమె చేసే మ్యాజిక్‌కి అంతా మైమరిచిపోవాల్సిందే. `ఫిదా`, `ఎంసీఏ`, `లవ్‌స్టోరీ`లో ఆమె డాన్సులు మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంటాయి. HBD Sai Pallavi.

36

సాయిపల్లవి ఎంతటి గొప్ప డాన్సర్‌ అని చెప్పడానికి చిరంజీవి చెప్పిన వ్యాఖ్యలే ఉదాహరణగా చెప్పొచ్చు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `లవ్‌స్టోరీ` ఆ మధ్య విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి వచ్చారు. ఆయన `భోళా శంకర్‌` చిత్రంలో చెల్లి పాత్ర కోసం ఆమెని అప్రోచ్‌ అయ్యారు టీమ్‌. కానీ ఆమె రిజక్ట్ చేసిందట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సాయిపల్లవి ఒప్పుకోకపోవడమే మంచిదయ్యిందని లోలోపల సంతోషించాడట చిరు. తాను ఆమెతో డాన్సులు చేయాలనుకుంటానని తెలిపారు. భవిష్యత్‌లో ఆమెతో కలిసి నటించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారంటే సాయిపల్లవి ఏం రేంజ్‌ డాన్సరో అర్థం చేసుకోవచ్చు. 
 

46

సాయిపల్లవి రెగ్యూలర్‌ హీరోయిన్‌ పాత్రలు చేయదు. మిగిలిన హీరోయిన్ల మాదిరిగా, అలా వచ్చి ఇలా పోయే పాత్రలు, కేవలం హీరోతో డ్యూయెట్లు, అప్పుడప్పుడు లవ్‌ సీన్ల కోసం వచ్చే హీరోయిన్‌ పాత్రలు చేయదు. తన పాత్ర బలంగా ఉంటేనే, అది సినిమాపై ఇంపాక్ట్ ని చూపించేలా ఉంటేనే చేస్తుంది. అందుకే సాయి పల్లవి నటించిన `ఫిదా`, `ఎంసీఏ`, `పడి పడి లేచే మనసు`, `లవ్‌ స్టోరీ`, `శ్యామ్‌ సింగరాయ్‌`, `విరాటపర్వం` సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అదే సమయంలో ఆమె తక్కువ సినిమాలు చేయడానికి కూడా అదో కారణమని చెప్పొచ్చు. 

56

సాయిపల్లవికి యూత్‌లో, సోషల్‌ మీడియాలో ఉండే ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఆమె ఏదైనా షేర్‌ చేసుకున్నా సెకన్లలో ట్రెండ్‌ అవుతుంటుంది. ఆమె ఫోటోలు వైరల్‌ అవుతుంటాయి. లక్షల వ్యూస్‌ వస్తుంటాయి. అయితే సాయిపల్లవి పెద్దగా యాక్టివ్‌గా ఉండదు. ఎప్పుడో ఒకటి అర పోస్టులు పెడుతుంది. కానీ ఆమె ఫాలోయింగ్‌ మాత్రం బీభత్సమని చెప్పొచ్చు. ఇటీవల రష్మిక మందన్నా నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సాయిపల్లవి పాల్గొంది. ఆమె ఫాలోయింగ్‌ని చూసి ఏకంగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమారే షాక్‌ అయ్యారు. అంతేకాదు `లేడీ పవన్‌ కల్యాణ్‌` అంటూ ఖితాబివ్వడం విశేషం. అదే సాయిపల్లవిని అందరికంటే ప్రత్యేకంగా, మిగిలిన హీరోయిన్లకి ఉన్న తేడాని తెలియజేస్తుంది.

66

సాయిపల్లవిలో మనకు తెలియని ఓ గొప్ప లక్షణం ఉంది. ఆమె తన సినిమాలు సరిగా ఆడకపోతే, ఫెయిల్‌ అయితే తాను తీసుకున్న రెమ్యూనరేషన్‌లో కొంత బ్యాక్‌ ఇచ్చే లక్షణం కూడా ఉందట. పలువురు మేకర్స్ ఈ విషయాన్ని చెప్పి ఆమె ఎంతటి గొప్ప నటినో వివరించారు. అంతేకాదు ఆమె ఓపెన్‌ హార్టెడ్‌. మనసులో ఒకటి, బయటకు ఒకటి మాట్లాడదు. ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గానే ఉంటుంది. ఈ లక్షణాలే సాయిపల్లవిని అందరికంటే ప్రత్యేకంగా నిలిపాయని, ఆమెని సూపర్‌స్టార్‌ని చేశాయని అంటున్నారు నెటిజన్లు. Sai Pallavi Birthday Special.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories