సాయి పల్లవి సినిమాల జోరు.. 5 సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయబోతున్న రామాయణ్ సీత

Published : Apr 04, 2026, 03:42 PM IST

ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో సినిమా చేస్తోంది సాయి పల్లవిా.రెండో సినిమాగా  4000 కోట్ల భారీ బడ్జెట్ మూవీ.. రామాయణ్ లో సీత పాత్రను పోషిస్తోంది సాయి పల్లవి. ఈసినిమాతో పాటు నేచురల్ బ్యూటీ నటిస్తున్న సినిమాలేంటో తెలుసా..?

PREV
16
సింప్లిసిటీకి ఫేమస్...

సౌత్ నటి సాయి పల్లవి నటన మాత్రమే కాదు.. నిజ జీవితంలో.. సింప్లిసిటీకి ఫేమస్. ఆమె తన కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో అడుగు పెట్టిన సాయి పల్లవి..  ఇప్పుడు తన రాబోయే సినిమాలతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. 

26
బాలీవుడ్ లో ఫస్ట్ సినిమా..

సౌత్ తర్వాత సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె మొదటి హిందీ సినిమా 'ఏక్ దిన్' మే 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో. సునీల్ పాండే ఈ చిత్రానికి దర్శకుడు.

36
రామాయణ్ లో సీతగా..

డైరెక్టర్ నితేశ్ తివారీ 'రామాయణ్ పార్ట్ 1'లో కూడా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 6న విడుదల కానుంది.

46
రెండు భాగాలుగా తెరకెక్కనున్న సినిమా..

సాయి పల్లవి 'రామాయణ్ పార్ట్ 2'లోనూ నటిస్తుంది. ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

56
ధనుష్‌ .జోడీగా D55 లో..

సూపర్‌స్టార్ ధనుష్‌తో కలిసి సాయి పల్లవి 'D55' సినిమాలో కూడా కనిపించనుంది. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు. షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుంది.

66
మణిరత్నం దర్శకత్వంలో

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి ఓ సినిమాలో నటించనుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తారు. ఇది 2027లో రిలీజ్ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories