సావిత్రి, విజయ నిర్మల దారిలో సాయిపల్లవి.. కొత్త బాధ్యతలకు శ్రీకారం.. లేడీ పవర్‌ స్టార్‌ని అలా చూడబోతున్నామా?

Published : Mar 23, 2024, 07:00 AM ISTUpdated : Mar 23, 2024, 07:01 AM IST

లేడీ పవర్‌ స్టార్‌ సాయిపల్లవి.. తన రూట్‌ మారుస్తుంది. తనలోని కొత్త టాలెంట్‌ని బయటపెట్టేందుకు రెడీ అవుతుంది. సావిత్రి, విజయనిర్మల దారిలో వెళ్లేందుకు రెడీ అవుతుంది.   

PREV
16
సావిత్రి, విజయ నిర్మల దారిలో సాయిపల్లవి.. కొత్త బాధ్యతలకు శ్రీకారం.. లేడీ పవర్‌ స్టార్‌ని అలా చూడబోతున్నామా?

లేడీ పవర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఆమె మంచి మనసు, నిజాయితీ, ఫాలోయింగ్‌, క్రేజ్‌, అద్భుతమైన నటన, దాన్ని మించిన అత్యద్భుతమైన డాన్సులు ఆమెని లేడీ పవర్‌ స్టార్‌ని చేశాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సాయిపల్లవిలో మనం ఆమెలోని నటిని, డాన్సర్‌ని చూశాం. మున్ముందు ఇంకా చాలా చూడబోతున్నాం. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

26

సాయిపల్లవి తనలోని మరికొన్ని కొత్త టాలెంట్‌లు చూపించేందుకు రెడీ అవుతుంది. ఆమె తనని సరికొత్తగా ఆవిష్కరించుకోబోతుంది. అలనాటి తారలు మహానటి సావిత్రి, విజయ నిర్మల దారిలో తానుకూడా పయణించేందుకు అడుగులు వేస్తుంది. ఆ అడుగులకు ఆమె ఇప్పటికే శ్రీకారం చుట్టింది. మున్ముందు తనలోని కొత్త టాలెంట్‌ని చూపించబోతుంది సాయిపల్లవి. 
 

36

ఇంతకి ఈ లేడీ పవర్‌ స్టార్‌ ఏంచేయబోతుందంటే.. ఆమె దర్శకురాలిగా మారబోతుంది. అందుకోసం ఆల్‌రెడీ సాయిపల్లవి రైటర్‌గా మారిందట. ప్రస్తుతం ఆమె స్క్రిప్ట్ రాసుకుంటుందట. త్వరలో డైరెక్ట్ చేయబోతుందని తెలుస్తుంది. అందుకోసం అద్భుతమైన ఇంటెన్స్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తుందని తెలుస్తుంది. దర్శకురాలిగా కొనసాగాలని, కొత్త కథలను చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

46

అప్పట్లో సావిత్రి, విజయ నిర్మల కూడా ఇలానే నటిగా కొనసాగుతున్న సమయంలో, కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే డైరెక్షన్‌ సైడ్‌ వెళ్లారు. సావిత్రి సక్సెస్‌ కాలేదు. నిర్మాతగా, దర్శకురాలిగా ఆమె ఫెయిల్‌ అయ్యింది. చాలా నష్టాలను చవిచూసి కెరీర్‌నే నాశనం చేసుకుంది. విజయ నిర్మల మాత్రం దర్శకురాలిగా సక్సెస్‌ అయ్యింది. గిన్నిస్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. మరి సాయిపల్లవి దారి ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. అసలు ఇందులో నిజమెంతా అనేది మరింత ఆసక్తికరంగా మారింది. 

56

సాయిపల్లవి రేర్‌ పీస్‌. ఆమె అందరిలాంటి హీరోయిన్‌ కాదు. అందరిలా సినిమాలు చేయదు. తనకు నచ్చినవి, అందులోనూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తుంది. ఇది కెరీర్‌ పరంగా లాంగ్‌ రన్‌కి కష్టమవుతుంది. అందుకే సాయిపల్లవి మరో రూట్‌ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

66
Sai Pallavi, Naga Chaitanya

ప్రస్తుతం సాయిపల్లవి..నాగచైతన్యతో `తండేల్‌` చిత్రంలో నటిస్తుంది. `లవ్‌ స్టోరీ` తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ ఇది. చిత్రీకరణ దశలో ఉంది. షూటింగ్‌ సెట్‌లో సాయిపల్లవి లుక్స్‌ వైరల్ అవుతున్నాయి. మరోవైపు హిందీలో ఓ సినిమా చేస్తుంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌తో కమల్‌ హాసన్‌ ప్రొడక్షన్‌లో ఓ మూవీ చేస్తూ బిజీగా ఉంది లేడీ పవర్‌ స్టార్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories