Dil Raju : ‘ఫ్యామిలీ స్టార్’ కథాంశం ఇదే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన నిర్మాత దిల్ రాజు

Published : Mar 22, 2024, 10:33 PM IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)  తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ (FamilyStar) మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ టైమ్ ఆ సీక్రెట్ ను రివీల్ చేశారు.

PREV
16
Dil Raju : ‘ఫ్యామిలీ స్టార్’ కథాంశం ఇదే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన నిర్మాత దిల్ రాజు

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు  ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు ‘ఫ్యామిలీ స్టార్’ అని టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆయన  తాజాగా వివరించారు.

26

ఈ రోజు తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఐడీ, హెల్త్ కార్డ్, డైరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ‘ఫ్యామిలీ స్టార్’ గురించి ఇప్పటిదాకా రివీల్ చేయని ఓ విషయాన్ని తెలిపారు. 
 

36

ఆయన  మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ స్టార్ గా చూపించేందుకు చేసిన సినిమా కాదని, ఒక ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని దిల్ రాజు చెప్పారు.

46

మీరంతా ఎక్కడో ఉన్న మీ కుటుంబాలను గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. నేను, ఈ వేదిక మీద ఉన్న ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు, ఆర్ నారాయణమూర్తి మేమంతా సాధారణ జీవితాలతో మొదలై మా రంగాల్లో కష్టపడి ప్రయోజకులై పైకి వచ్చాం. ఇవాళ మా కుటుంబాలకు ఈ సొసైటీలో ఒక పేరు దక్కేలా చేశాం. అలాంటి వారంతా ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పడమే ‘ఫ్యామిలీ స్టార్’ కథాంశం.. అని అన్నారు.

56
photo credit-open heart with rk show

ఇక విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 

66

పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచింది. సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 5న సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories