మరోవైపు లాస్య మాజీ భర్త శేఖర్ ని వెతుకుతూ ఉంటారు తులసి, దీపక్. ఇక దివ్య ప్రవర్తనకి బాధపడుతూ ఉంటాడు విక్రమ్. అప్పుడే విక్రమ్ వాళ్ళ తాతయ్య వచ్చి ఎందుకు దివ్య ని అపార్థం చేసుకుంటున్నావు తన స్వభావం నీకు తెలియనిది కాదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను చూస్తున్నది ఊహించని దివ్యని తను అమ్మని అపార్థం చేసుకుంటుంది అంటూ దివ్య గురించి ఏవేవో చెప్తాడు విక్రమ్.