Sai Pallavi: 5 వేలతో స్టార్ట్ చేసి, 6 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన హీరోయిన్‌, ఆమె ఉంటే సినిమా హిట్టే !

Published : Feb 11, 2025, 03:10 PM ISTUpdated : Feb 12, 2025, 07:37 AM IST

కేవలం ఐదు వేలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్‌ హీరోయిన్‌ ఇప్పుడు ఒక్కో మూవీకి ఆరు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగింది. మరి ఆ హీరోయిన్‌ ఎవరు? అనేది చూస్తే.   

PREV
15
Sai Pallavi: 5 వేలతో స్టార్ట్ చేసి, 6 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన హీరోయిన్‌, ఆమె ఉంటే సినిమా హిట్టే !

ఇప్పుడు సినిమా చాలా మారిపోతుంది. పాన్‌ ఇండియా చిత్రాల హవా పెరిగింది. అదే సమయంలో హీరోల హీరోయిన్ల పారితోషికాలు పెరిగాయి. హీరోయిన్లకి కూడా భారీగానే పారితోషికాలు ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ స్థాయికి హీరోయిన్లు ఎదిగారు.

అందులో భాగంగా ఓ హీరోయిన్‌ గురించి ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. ఆమె ఐదు వేల రూపాయలకు సినిమా కెరీర్‌ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆరు కోట్లు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. మరి ఆమె ఎవరు అనేది చూస్తే.  
 

25
Sai Pallavi starrer Thandel film

ఆమె ఎవరో కాదు సాయిపల్లవి. ప్రస్తుతం లేడీ పవర్‌ స్టార్‌ సాయిపల్లవి హవా నడుస్తుంది. ఆమె కంటెంట్‌ ఉన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వెండితెరపై అద్భుతమైన డాన్సులు, నటనతో మ్యాజిక్‌ చేస్తూ మెప్పిస్తుంది. తాజాగా ఆమె తెలుగులో `తండేల్‌` మూవీతో అలరిస్తుంది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్‌లో రన్‌ అవుతుంది. 

35
Sai Pallavi

ఈ సందర్భంగా సాయిపల్లవి జర్నీ చూస్తే ఆమె చిన్న డాన్సర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. `ఢీ` షోలో డాన్సర్‌గా పాల్గొంది. ఆ సమయంలో సాయిపల్లవి అందుకున్న తొలి పారితోషికం ఐదు వేలు.  అలా డాన్సర్‌గా వర్క్ చేస్తూ 2015లో `ప్రేమమ్‌`(మలయాళం) చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇందులో టీచర్‌గా, డాన్సర్‌గా అదరగొట్టింది. సౌత్‌ మొత్తం పాపులర్‌ అయ్యింది సాయిపల్లవి. 
 

45
Sai Pallavi

తెలుగులోకి `ఫిదా` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తెలంగాణ అమ్మాయిగా మెప్పించింది. అద్భుతమైన నటన, డాన్సులతో ఉర్రూతలూగించింది. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న ఆమె తెలుగులో ఆమె `ఎమ్‌సీఏ`, `పడి పడి లేచే మనసు`, `లవ్‌ స్టోరీ`, `శ్యామ్‌ సింగరాయ్‌`, `విరాట పర్వం`, ఇప్పుడు `తండేల్‌` చిత్రాల్లో నటించింది. 

55
Sai pallavi

ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `రామాయణ్‌` మూవీలో నటిస్తుంది. రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సీతగా కనిపిస్తుంది సాయిపల్లవి. ఈ సినిమాకిగానూ ఆమె పారితోషికం ఆరు కోట్లు అని సమాచారం. ఇటీవల తెలుగు మూవీ `తండేల్`కిగానూ ఆమె ఐదు కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.

ఇలా ఐదు వేలతో కెరీర్‌ని స్టార్ట్ చేసి ఆరు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగింది సాయిపల్లవి. ఎంతో మంది కొత్త హీరోయిన్లకి ఆమె ఆదర్శంగా నిలుస్తుంది. అంతేకాదు ఆమె సినిమా చేసిందంటే అది కచ్చితంగా హిట్టే. అంతటి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌గా సాయిపల్లవి రాణిస్తుంది. 

readv more:Thandel: ‘తండేల్’ సోమవారం పరీక్ష పాసైందా? , కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

also read: `మెగా`బంధం తెంచుకున్నట్టేనా? రామ్ చరణ్‌ విషయంలో మరోసారి దొరికిపోయిన అల్లు అరవింద్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories