ఐశ్వర్య నిర్మాతగా ఎందుకు మారారనే ప్రశ్నలు వస్తున్నాయి. వరుస ఫ్లాప్ ల వల్ల ఎవరూ ఆమె సినిమాలు నిర్మించడానికి ముందుకు రాలేదని, అందుకే తానే నిర్మాత అయ్యారని నెటిజన్లు అంటున్నారు. ఆమె తండ్రి, చెల్లి సౌందర్య నిర్మాతలుగా ఫ్లాప్ అయ్యారు. మరి ఐశ్వర్య నిర్మాతగా సక్సెస్ అవుతారా లేదా చూడాలి.
అదే సమయంలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా ఆమె నిర్మాతగా డేర్ చేయడం విశేషం. తనలోనూ ప్యాషన్ ని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే తన తపనకిది అద్దం పడుతుంది. మరి ఈ సారైనా సక్సెస్ అవుతుందా? అనేది చూడాలి. ఫ్యాన్స్ మాత్రం ఆమెకి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ ఇటీవలే విడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 18ఏళ్ల తర్వాత వీరి విడాకులు తీసుకున్నారు.
read more: Dhanush: సినిమాకి తానే దర్శకుడు, కానీ ఆడియో ఈవెంట్‌కి బంక్ కొట్టిన ధనుష్, ఏం జరిగింది?
also read: Vijay: విజయ్ పండగ శుభాకాంక్షలు: నెటిజన్ల ట్రోలింగ్.. కారణం ఏంటంటే?