చెల్లి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ సాయిపల్లవి ఎమోషనల్ పోస్ట్.. ఇంకా తేరుకోలేదట.. చీరలో కనువిందు..

First Published | Jan 25, 2024, 8:41 AM IST

లేడీ పవర్ స్టార్‌ సాయిపల్లవి తన చెల్లి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ సందర్బంగా ఆయా ఫోటోలను పంచుకుంది సాయిపల్లవి. ఆమె ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. 
 

సాయిపల్లవి కంటే తన చెల్లి పూజా కన్నన్‌ పెళ్లి చేస్తుంది. చెల్లి పూజా కూడా నటిగా రాణిస్తుంది. ఆమె తమిళంలో ఓ సినిమా చేసింది. అయితే ఇంతలోనే ప్రేమలో పడింది. నటుడు వినీత్‌లో ప్రేమలో మునిగిపోయింది. వెంటనే పెళ్లి వరకు వెళ్లింది. 
 

రెండు రోజుల క్రితమే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. చాలా గ్రాండ్‌గా ఈ నిశ్చితార్థ వేడుక జరగడం విశేషం. ఈ ఫోటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది సాయిపల్లవి. 
 


ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. కాబోయే పెళ్లి జంటకి ఆమె అభినందనలు తెలియజేస్తూ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. నా చెల్లెలి నిశ్చితార్థం జరిగింది` అంటూ బాధపడుతూ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఎమోజీని పంచుకుంది. 
 

ఈ నిశ్చితార్థం సింక్ కావడానికి కొంత సమయం పడుతుందని, తమ్ముడికి అతను ఏమి చేశాడో తెలియదు అని పేర్కొంది. ఈ ఎంగేజ్‌మెంట్‌ అంతా ఓ కలలా ఉందని ఆమె చెప్పింది. 
 

అంతేకాదు గుడ్‌ లక్‌ వినీత్‌, మా కుటుంబంలోకి స్వాగతం అని పేర్కొంది సాయిపల్లవి. ఈ సందర్భంగా ఎంగేజ్‌మెంట్‌లోని బ్యూటీఫుల్‌ మూమెంట్‌ పిక్స్ ని పంచుకుంది. 
 

సాయిపల్లవి తన చెల్లితో సరదాగా గడిపిన పిక్స్‌, ఆటపట్టించే పిక్స్, అలాగే అల్లరి చేసే పిక్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో మధురమైన క్షణాలను బంధించిన ఫోటోలు ఉండటం విశేషం. అవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 
 

సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో `తడేల్‌` చిత్రంలో నటిస్తుంది. `లవ్‌ స్టోరీ` తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. 
 

దీంతోపాటు తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి ఓ మూవీ చేస్తుంది. దీనికి కమల్‌ హాసన్‌ నిర్మాత కావడం విశేషం. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరోవైపు చైతూ మూవీ ఇటీవలే ప్రారంభమైంది. 
 

లేడీ పవర్ స్టార్‌ సాయిపల్లవి తన చెల్లి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ సందర్బంగా ఆయా ఫోటోలను పంచుకుంది సాయిపల్లవి. ఆమె ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. 
 

Latest Videos

click me!