ఫ్యామిలీతో కలిసి తమన్నా ప్రత్యేక పూజలు.. మేకప్‌ లేకుండా ఆపిల్‌ పండులా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ

Published : Jan 25, 2024, 06:55 AM ISTUpdated : Jan 25, 2024, 07:54 AM IST

తమన్నా అంటే మిల్కీ బ్యూటీ అంటుంటారు. అంతటి తెల్లగా ఉంటుంది. కానీ మేకప్‌ లేకపోతే ఎలా ఉంటుందో చూపించింది. ఏకంగా ఆపిల్‌ పండులా నిగనిగలాడటం విశేషం.   

PREV
16
ఫ్యామిలీతో కలిసి  తమన్నా ప్రత్యేక పూజలు.. మేకప్‌ లేకుండా ఆపిల్‌ పండులా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ

తమన్నా ఓ వైపు సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. కెరీర్‌ పరంగా బోల్డ్ గా, వైల్డ్ గా మారింది. స్వేచ్ఛగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తుంది. తనని మరింతగా ఎక్స్ ప్లోర్‌ అయ్యేలా చేస్తుంది. మరోవైపు పర్సనల్‌ లైఫ్‌కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె దేవాలయాల సందర్శనలో బిజీగా ఉంది. 
 

26

తమన్నా గౌహతిలోని ప్రఖ్యాత కామఖ్య ఆలయాన్ని సందర్శించింది. తన ఫ్యామిలీతో కలిసి ఆమె ఈ దేవాలయాన్ని సందర్శించడం విశేషం. పూర్తిగా ఆమె ఆథ్యాత్మిక సేవలో మునిగిపోయింది. ప్రత్యేకంగా పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా తమన్నా లుక్‌, గెటప్‌ ఆశ్చర్యంగా ఉన్నాయి. 

36

ఇందులో పసుపు రంగు దుస్తులు ధరించింది. కాషాయం మేళవింపుతో కూడిన టాప్‌ ధరించింది. మెడలో బంతిపూల దండ, దేవుడి శాలువ, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని ట్రెడిషనల్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది మిల్కీ బ్యూటీ. 

46

తమన్నా అంటే మిల్కీ బ్యూటీ అంటాం. ఆమె పాల మీగడలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేకప్‌ లేకుండా మెరిసింది. ఒరిజినల్‌ అందం చూపించింది. అయితే మేకప్‌ లేకుండానే తమన్నా మరింత అందంగా ఉంది. ఆపిల్‌ పండులా ఉందని నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. 

56

తమన్నాకి దేవుడంటే అపారమైన నమ్మకం. ఎక్కువగా భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తుంటుంది. అందుకే తరచూ దేవాలయాలు సందర్శిస్తుంటుంది. తరచూ కొయంబత్తూర్‌లోని ఆదియోగి శివుడినిసందర్శిస్తూ యోగ, ప్రత్యేక పూజలు చేస్తుంటుంది తమన్నా. 

66

ఇక నటిగా బోల్డ్ రోల్స్ తో మెప్పిస్తున్న తమన్నా చివరగా తెలుగులో `భోళా శంకర్‌`లో నటించింది. ఇది పెద్దగా ఆడలేదు. ఇప్పుడు `అరణ్మనై4`, `వేదా`, `స్ట్రీ2` చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. మరోవైపు ప్రియుడు విజయ్‌ వర్మతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతుందని తెలుస్తుంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories