Prabhas Fauji : హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'ఫౌజీ' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో నటించబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది.
Bollywood Action Hero in Prabhas latest Fauji in telugu
Prabhas Fauji : సీతారామం వంటి క్లాసిక్ లవ్ స్టోరీని తీసిన హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫౌజీ’.వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని హను చాలా నమ్మకంగా ఉన్నాడు.
ఇందులోనూ మంచి ప్రేమ కథ ఉంటుందని చెప్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఆజాద్ హిందు ఫౌజ్ సభ్యుడిగా కనిపిస్తాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. అందుకే ఈ సినిమా కోసం ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఇదిగా ఉంటే ఈ సినిమా గురించి రకరకరాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ వార్త ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఏమిటా వార్త..వివరాల్లోకి వెళితే...
24
Bollywood Action Hero in Prabhas latest Fauji in telugu
ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ యాక్షన్ హీరో నటించబోతున్నాడనే వార్త బాలీవుడ్ మీడియా ద్వారా బయిటకు వచ్చింది.
టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘జాట్’ మూవీలో హీరోగా నటిస్తున్న సన్నీ డియోల్ ప్రభాస్ ఫౌజీ లో విలన్ పాత్రలో నటించబోతున్నాని చెప్పుకుంటున్నారు. ఈ పీరియాడిక్ వార్ మూవీలో ప్రభాస్‌ను ఢీకొనే పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా యాక్షన్ బేస్డ్‌గా ఉంటుందట.
34
Bollywood Action Hero in Prabhas latest Fauji in telugu
ఈ క్రమంలో బాలీవుడ్ మార్కెట్ కు ప్లస్ అవుతుందని ఫౌజీ మేకర్స్ సన్నీ డియోల్‌ను ఈ పాత్ర కోసం అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.
మరో ప్రక్క ఆయన సోదరుడు బాబీ డియోల్ ఇప్పటికే తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటంతో, ఇప్పుడు సన్నీ డియోల్ కూడా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది కేవలం రూమర్ గా మిగిలిపోతుందా, నిజం అవుతుందా అనేది తెలియాలంట మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.
44
Bollywood Action Hero in Prabhas latest Fauji in telugu
మరో ప్రక్క ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్‌గా రాబోతోందట. ఈ చిత్రం కోసం మేకర్లు దాదాపు ఏడువందల కోట్లు ఖర్చు పెడుతున్నారని వినపడుతోంది. ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా కలిపేసుకుంటే ఆ రేంజ్‌లో బడ్జెట్ అవుతోందట.
అలాగే ఈ సినిమాకు ఇమాన్వీ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. హీరోయిన్ పాత్రకు క్లాసికల్ డ్యాన్స్ వచ్చి ఉండాలని హను అన్నాడు. అందుకే ఇమాన్విని ఇన్ స్టాలో క్లాసికల్ డ్యాన్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇందులో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడని చెప్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.