సీక్రెట్ చెప్పిన సాయి పల్లవి, అందుకే ఆమె మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటుందట..?

Published : Jun 11, 2023, 01:06 PM IST

తనకు సంబంధించిన ఓ సీక్రేట్ ను రివిల్ చేసింది సాయి పల్లవి. తన మానసిక ప్రశాంతతకు, మైండ్ స్ట్రెంత్ కు కారణం ఏంటీ అనేది చెప్పేసింది. స్వతహాగా డాక్టర్ కదా.. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటుదేమో అని అనుకునేరు. కారు సాయి చెప్పిన సీక్రేట్ ఏంటో చూడండి..  

PREV
16
సీక్రెట్ చెప్పిన సాయి పల్లవి, అందుకే ఆమె మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటుందట..?

సాయి పల్లవి హీరోయిన్లందరిలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తనకు నచ్చితేసినిమా చేస్తుంది.. నచ్చకపోతే.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పక్కన పెట్టేస్తుంది. అంతే కాని. నచ్చకపోయినా ఎవరికోసమో సినిమా చేయదు.. స్టార్ పక్కన ఆఫర్ అని అన్నింటికి తల ఊపదు. అంత స్టాండెడ్ గా ఉంటుంది సాయి పల్లవి. 

26

అంతే కాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సాయి పల్లవి. మానసికంగా ప్రెజర్ ఫీల్ అవ్వదు. టెన్షన్ పడదు. సినిమా రిలీజ్ కదా.. రిజల్ట్ ఏమౌతుందో అనే భయం ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలుఅది ఎలా సాధ్యం. సాయి పల్లవి హెల్త్ సీక్రేట్ ఏంటీ.. 
 

36

మేకప్ కూడా వేసుకెకుండా.. ఓ సాధారణ అమ్మాయిలా తన సినిమాల్లో నటించేస్తుంది సాయి పల్లవి. పక్కింటి పిల్ల మాదిరి కనిపిస్తుంది. ఈక్రమంలోనే ఈమధ్య సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి... తాజాగా తమిళ నేచురల్ స్టార్ శివకార్తికేయాతో ఓ సినిమాలో నటిస్తోంది. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది నేచురల్ బ్యూటీ. 

46

ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ..  తన వృత్తిపరమైన జీవితం గురించి వివరించింది. తన వృత్తిని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఇష్టపడుతూ ఉంటానని అంటుంది. పనిలో సంతోషాన్ని వెతుకున్నప్పుడే మనకు ఆ పని విషయంలో చాలా తృప్తి కలుగుతుందని తెలిపింది సాయి.అదేవిధంగా వృత్తిపరమైన జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు ముడి పెట్టకూడదని అంటోంది  సాయి పల్లవి.

56

ఎప్పుడైతే వృత్తిపరమైన జీవితాన్ని వ్యక్తిగత జీవితంతో పోల్చి చూస్తారో.. రెండూ కలిపి చూస్తారో.. అప్పుడు మనిషిమనశ్శాంతి కోల్పోతారు అంటోంది సాయి. అందుకే తాను  ఒకసారి షూటింగ్ లోకేషన్ లోకి అడుగుపెడితే తన ఫ్యామిలీ గురించి తన వ్యక్తిగత విషయాలన్నింటి గురించి మర్చిపోతానని అంటోంది బ్యూటీ.  

66
sai pallavi

ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తరువాత ఆ సినిమా గురించి షూటింగ్ గురించి ఏమాత్రం ఆలోచించనని, ఇంట్లో కూడా డిస్కర్షన్ చేయనంటోంది సాయి. ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా దృఢంగా ఉండగలం అంటుంది సాయి పల్లవి. తాను అలా చేయబట్టే ఇలా ఉండగలుగుతుంది అంటోంది. 

Read more Photos on
click me!

Recommended Stories