Sai pallavi, amaran, Dulquer Salmaan
సాయి పల్లవి .. ఇలాంటి హీరోయిన్ ను ఈ కాలంలో చూస్తాం అని ఎవరు అనుకుని ఉండరు. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు మాత్రమే రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో.. ఫ్యాషన్ పేరుతో.. సినిమా సినిమాకు హీరోయిన్ ఒంటిమీద బట్టలు పొట్టిగా మారుతున్న రోజుల్లో.. తాను కట్టుబడి ఉన్న పాలసీని మార్చకుండా ఎన్ని ఆఫర్లు వచ్చినా.. ఎంత డబ్బు ఆశ చూపించినా.. వాటివైపు కూడా కన్నెత్తి చూడకుండా లైఫ్ నుహ్యాపీగా లీడ్ చేస్తున్న హీరోయిన్ సాయిపల్లవి.
మరి ఇలా ఎక్సె పోజింగ్ చేయను, కథ నచ్చితేనే నటిస్తాను అంటే ఇండస్ట్రీలో స్టార్ డమ్ రావడం కష్టం కదా అంటే.. అదేం లేదు. సాయి పల్లవి ప్రస్తుతం స్టార్ హీరోయిన్. ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తుంటారు నిర్మాతలు. ఎందుకంటేఎవరిని ఇబ్బంది పెట్టే హీరోయి కాదు సాయి పల్లవి. కథ నచ్చితే.. ఏం ఆలోచించకుండా... తనకు యాక్టింగ్ స్కోప ఉన్న పాత్రఅయితే డబ్బలు తీసుకోకుండా అయిన చేసేస్తుంది సాయి పల్లవి. అందుకే ఆమె అంటే ఆడియన్స్ కు చాలా ఇష్టం. హీరోలకు ఉన్న ఫాలోయింగ్ ఉంది సాయి పల్లవికి.
కమర్షియల్ గా చూసుకుంటే టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించాల్సి ఉంది. కాని ఆమె కథ నచ్చి, నటనకుఆస్కారం ఉన్న పాత్రలే చేస్తుంది కాబట్టి.. టాలీవుడ్ లో నాని, నాగచైతన్య, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో మాత్రమే మంచి మంచి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె నాగచైతన్య హీరోగా నటిస్తున్న ప్రయోగాత్మక సినిమా తండేల్ లో నటిస్తోంది. ఇక సాయి పల్లవికి చెందిన చాలా విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
అయితే తాజాగా ఆమెకు సబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే.. సాయి పల్లవి ఓ సినిమా కోసం తీసుకున్న డబ్బులన్నీ తిరిగి ఇచ్చేసిందట. నిర్మాత నష్టాల్లో ఉండటంతో ఈ మంచి పని చేసి శభాష్ అనిపించుకుందట. ఇంతకీ ఆసినిమా ఏదో తెలుసా..? పడిపడిలేచేమనసు. అవును ఈసినిమాకోసం సాయి పల్లవి తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేసిందట.
ఈసినిమా కథ పరంగా చాలా బాగుంటుంది. కానికమర్షియల్ గా మాత్రం ఆడలేదు. హనురాఘపూడి డైరెక్ట్ చేసిన ఈ. సినిమా ప్రారంభానికి ముందే సాయిపల్లవి అడ్వాన్స్ తీసుకుందట. సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యాక కమర్షియల్ ఫ్లాప్ అని ఆమెకు తెలిసింది. నిర్మాత బాగా నష్టపోయాడని అర్థం చేసుకుంది. అయినప్పటికీ ఆ చిత్ర నిర్మాత పూర్తి రెమ్యూనరేషన్ చెక్ ని సాయి పల్లవి కి అందిస్తుండగా, ఆమె తీసుకోలేదట.
Sai Pallavi
అసలే కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు నాకు ఇది ఎందుకులేండి అని చెప్పి 40 లక్షల రూపాయిలను వదులుకుందట. ఇంత గొప్ప మనసు చూపించిన సాయి పల్లవికి ఆ నిర్మాత ఎంతో రుణపడి ఉన్నాడుఅంటున్నారు నెటిజన్లు. సాయిపల్లవి మంచి మనసు తలచుకుని ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.