మహేష్ బాబుకు సెంటిమెంట్స్ ఎక్కువ. టైటిల్స్ విషయంలో మరింత పర్టిక్యులర్ గా ఉండేవారు. మురారి మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు అనంతరం మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. ఒక్కడు, అతడు, అర్జున్, పోకిరి, దూకుడు, అతిథి, ఖలేజా, ఆగడు... ఇలా అనేక చిత్రాలు మూడు అక్షరాల టైటిల్స్ తో మహేష్ బాబు చేశారు. వీటిలో ఒక్కడు, పోకిరి, దూకుడు ఇండస్ట్రీ హిట్స్ గా ఉన్నాయి.