నయనతార-విఘ్నేష్ హనీమూన్‌.. థాయ్‌లాండ్‌లో రెచ్చిపోయిన కొత్త జంట.. ఫోటోలు వైరల్‌

Published : Jun 20, 2022, 06:30 PM ISTUpdated : Jun 20, 2022, 08:40 PM IST

నయనతార, విఘ్నేష్‌ శివన్‌ హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. పది రోజుల క్రితం వీరి మ్యారేజ్‌ అయిన నేపథ్యంలో ఇప్పుడు హనీమూన్‌ ఎంజాయ్‌ చేయడానికి వెళ్లారీ కొత్త జంట.   

PREV
19
నయనతార-విఘ్నేష్ హనీమూన్‌.. థాయ్‌లాండ్‌లో రెచ్చిపోయిన కొత్త జంట.. ఫోటోలు వైరల్‌

లేడీసూపర్‌స్టార్ గా సౌత్‌లో గుర్తింపు తెచ్చుకున్న నయనతార(Nayanathara), దర్శకుడు విగ్నేష్‌ శివన్‌(Vignesh Shivan) ఇటీవల మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తుందీ జంట. హనీమూన్‌ కోసం వీరి థాయ్‌లాండ్‌ వెళ్లగా, అక్కడ ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. థాయ్‌లాండ్‌ అందాలను ఆస్వాధిస్తున్నారు. 
 

29

ప్రస్తుతం నయనతార, విఘ్నేష్‌ శివన్‌లకు సంబంధించిన హనీమూన్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ లో వీరిద్దరు ఓ అభిమానితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో నయనతార, విఘ్నేష్‌ బ్లూ జీన్స్ డ్రెస్‌ ధరించి ఉండటం విశేషం. 
 

39

మరోవైపు బ్యాంకాంక్‌లో ఓ స్టార్‌ హోటల్‌లో దిగినట్టు తెలుస్తుంది. పక్కన వాటర్‌, చెట్లు,ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉందా ప్రాంతం. అందులో నయనతార ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తుంది. అన్నీ వదిలేసి ఇద్దరే ఏకాంతంగా గడుపుతున్నారు. జీవితాంతం గుర్తిండిపోయేలా ఈ హనీమూన్‌ని ఎంజాయ్‌ చేయాలని ఫిక్స్ అయ్యారు. Nayanathara Honeymoon. 

49

ఎల్లో డ్రెస్‌ ధరించి నయన్‌ చైర్‌లో కూర్చొగా, భర్త విఘ్నేష్‌ ఆమెకి ప్రేమ పాఠాలు చెబుతున్నారు. ఇద్దరూ తమ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంటెన్స్ గా ఉన్న వీరి ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

59

మ్యారేజ్‌ అయి పదిరోజుల తర్వాత ఈ జంట హనీమూన్‌ వెళ్లింది. జూన్‌ 9న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలో వీరి మ్యారేజ్ ఆద్యంతం అబ్బురపరిచేలా జరగడం విశేషం. రజనీకాంత్‌, షారూఖ్‌ ఖాన్‌ వంటి పలువురు దిగ్గజ సెలబ్రిటీలు నయనతార-విఘ్నేష్ పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.

69

మొదటగా వీరి తిరుమలలో శ్రీవారి సమక్షంలో మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో అది కుదరలేదు. దీంతో మ్యారేజ్‌ జరిగిన వెంటనే పెళ్లిబట్టలతోనే వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి ఫోటో షూట్‌ సమయంలో చెప్పులు ధరించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివరణ ఇచ్చారు.
 

79

అనంతరం మిత్రులు, శ్రేయోభిలాషులు,సినీ సెలబ్రిటీలు, మీడియాకి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు. వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అంతేకాదు తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు భోజనాలు పెట్టడం విశేషం. 
 

89

హనీమూన్‌లో భాగంగా బ్యాంకాక్‌లో ఎంజాయ్‌ చేస్తున్న నయనతార, విఘ్నేష్‌జంట. ఎలాంటి కండీషన్స్ లేకుండా వీరిద్దరు అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. థాయిలాండ్‌లో రచ్చ చేస్తున్నారు.

99

హనీమూన్‌లో భాగంగా బ్యాంకాక్‌లో ఎంజాయ్‌ చేస్తున్న నయనతార, విఘ్నేష్‌జంట. ఎలాంటి కండీషన్స్ లేకుండా వీరిద్దరు అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. థాయిలాండ్‌లో రచ్చ చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories