పూజా వెంటే స్టార్‌ హీరోలు.. దిమ్మతిరిగేలా బుట్టబొమ్మ నెక్ట్స్ సినిమాల లైనప్‌.. వారికి జెలసీ పుట్టిస్తుందిగా?

Published : Jun 20, 2022, 05:17 PM IST

పూజా హెగ్డే టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. ఆమె జోరుకి ఇప్పుడు ఇతర హీరోయిన్లంతా షాక్‌ అవుతున్నారు. ముఖ్యంగా ఆమె సినిమాల లైనప్‌ చూస్తుంటే దిమ్మతిరిగిపోయేలా ఉంది. తోటి హీరోయిన్లకి జెలసీ పుట  

PREV
18
పూజా వెంటే స్టార్‌ హీరోలు.. దిమ్మతిరిగేలా బుట్టబొమ్మ నెక్ట్స్ సినిమాల లైనప్‌.. వారికి జెలసీ పుట్టిస్తుందిగా?

టాలీవుడ్‌ బుట్టబొమ్మగా పేరుతెచ్చుకున్న పూజా హెగ్డే అత్యంత క్రేజ్‌ ఉన్న కమర్షియల్‌ హీరోయిన్‌. అందాల ఆరబోతకు, మంచి నటనకు ఆమె రెడీగా ఉంటుంది. పాత్ర నిడివి పట్టించుకోదు, ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా మంచి సినిమాల్లో, భారీ సినిమాల్లో భాగమవ్వాలనేది ఆమె కోరిక. ఆ దిశగానే ముందుకు సాగుతుంది.

28

స్టార్‌ హీరోలకు పూజా ఇప్పుడు బెస్ట్ ఆప్షన్‌ అవుతుంది. స్టార్‌ హీరోలు చిన్న హీరోయిన్లతో చేయడం కష్టం. వారికి సరితూగే హీరోయిన్లనే కోరుకుంటారు. అలాగని రిపీట్‌ చేయడం కష్టమే. కానీ పూజా విషయంలో అన్ని రకాల లిబర్టీ ఉంటుంది. స్టార్‌ హీరోలకు తగ్గ ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేయడం పూజాకే సాధ్యం. ప్రస్తుతం ఈ అమ్మడికి కూడా తెలుగు, తమిళం, హిందీలో మంచి పేరుంది. దీంతో బిగ్‌ స్టార్స్ అంతా పూజా వెంటపడుతున్నారు.
 

38

పూజా హెగ్డే ప్రస్తుతం నటిస్తున్న సినిమాల లైనప్‌ ఆశ్చర్యపరుస్తుంది. మూడు లాంగ్వేజ్‌లో ఆమెకి బిగ్‌ ప్రాజెక్ట్ లు వస్తుండటం విశేషం. అందులో భాగంగా తెలుగులో ఇప్పుడు పూజా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యింది. మూడు భారీ చిత్రాలే. ఇటీవల `రాధేశ్యామ్‌`, `ఆచార్య`లో మెరిసిన పూజా హెగ్డే.. ప్రస్తుతం మహేష్‌బాబుతో కలిసి త్రివిక్రమ్‌ సినిమాలో చేస్తుంది. `మహర్షి` తర్వాత ఈ జంట మరోసారి రిపీట్‌ కాబోతుంది. 

48

దీంతోపాటు రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండతోనూ సినిమా చేస్తుంది బుట్టబొమ్మ. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `జనగణమన` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ కూడా జరుపుకుంటోంది. దీంతోపాటు పవర్‌ స్టార్‌ సినిమాకి కమిట్‌ అయ్యింది. హరీష్‌ శంకర్‌తో పవన్‌ చేయబోతున్న `భవదీయుడు భగత్‌ సింగ్‌` చిత్రంలోనూ పూజా ఫైనల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా రూమర్స్ వచ్చినా, పూజా కమిటెడ్‌గానే ఉందని టాక్‌. 

58

మరోవైపు హిందీలోనూ బిజీ అవుతుంది పూజా హెగ్డే. బాలీవుడ్‌లో సినిమాలు చేసినా సరైన గుర్తింపు దక్కలేదు. దీంతో చాలా కాలంగా సరైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రెండు బిగ్‌ ప్రాజెక్ట్ లు పూజా తలుపు తట్టాయి. ప్రస్తుతం ఆమె సల్మాన్‌ ఖాన్‌తో `కభీ ఈడ్‌ కబీ దివాళీ` చిత్రం చేస్తుంది. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి `సర్కస్‌` సినిమా చేస్తుంది. ఈ రెండు చిత్రాలతో బాలీవుడ్‌లో గట్టిగా పాగా వేయాలని చూస్తుంది పూజా. వీటితోపాటు మరికొన్ని సినిమాలకు ఆప్షన్‌గా నిలుస్తుందట పూజా.

68

దీంతోపాటు కోలీవుడ్‌నూ పూజాకి గుర్తింపు లేదు. ఆమె చేసిన సినిమాలు కూడా రెండే. ఇటీవల విజయ్‌తో `బీస్ట్`లో మెరిసింది. హీరోయిన్‌గా తమిళ సినిమాతోనే పరిచయం అయ్యింది. ఇప్పుడు సూర్య చిత్రంలోనూ నటించబోతున్నట్టు సమాచారం. ఈ రూమర్‌లో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

78

దీంతోపాటు కన్నడలోకి ఎంట్రీకి ప్లాన్‌ జరుగుతుందని సమాచారం. కన్నడ స్టార్‌ యష్‌తో పూజా జోడీ కట్టబోతుందని తెలుస్తుంది. `కేజీఎఫ్‌ 2`తో ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన యష్‌ నెక్ట్స్ నార్తన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో ఫీమేల్‌ లీడ్‌గా పూజా హెగ్డే పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇందులో నిజనిజాలు తెలియాల్సి ఉంది. నిజమైతే పూజా సినిమాల లైనప్‌ మాత్రం అదిరిపోయేలా ఉందని చెప్పొచ్చు.

88

సినిమాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ పూజాకి విశేషమైన ఫాలోయింగ్‌ ఉంది. ఇప్పటికే టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గానూ నిలిచింది. ఒక్కో చిత్రానికి ఆమె నాలుగు కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందని సమాచారం. ఇక ఇప్పుడున్న సినిమాలు విడుదలై హిట్‌ అయితే పూజా అత్యంత కాస్ట్లీ హీరోయిన్‌ కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories