Sai Pallavi: రావణుడిగా నటించాలంటే దమ్ము కావాలి.. యశ్‌పై సాయి పల్లవి ప్రశంసలు!

Published : Oct 25, 2026, 11:45 AM IST

'రామాయణ' సినిమాలో రావణుడి పాత్ర చేస్తున్న యశ్‌ను హీరోయిన్ సాయి పల్లవి తెగ మెచ్చుకుంది. రావణుడిగా నటించడానికి ఎవరికైనా చాలా ధైర్యం కావాలని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

PREV
15
Sai Pallavi Appreciates Yash

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా ఉన్న సాయి పల్లవి, ఇప్పుడు 'రామాయణ' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో సీతగా నటిస్తున్న ఆమె, రావణుడి పాత్ర చేస్తున్న యశ్‌ను బాగా మెచ్చుకుంది. 'రావణుడిగా నటించడానికి ఎవరికైనా చాలా ధైర్యం కావాలి' అని చెబుతూ, ఇంత ఛాలెంజింగ్ రోల్ ఒప్పుకున్న యశ్ గట్స్‌కు ఆమె హ్యాట్సాఫ్ చెప్పింది.

25
సౌత్‌లో వరుస అవకాశాలు

మలయాళం 'ప్రేమమ్' సినిమాలో మలర్ టీచర్‌గా నటించి సాయి పల్లవి పెద్ద క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత సౌత్‌లో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తన న్యాచురల్ యాక్టింగ్, సింపుల్ క్యారెక్టర్, డిఫరెంట్ కథలతో ఆమె ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటిన సాయి పల్లవి, ఇప్పుడు హిందీ సినిమాల్లోకి అడుగుపెడుతోంది. 'రామాయణ'లో సీతగా నటిస్తున్న ఆమె, అదే సినిమాలో రావణుడిగా కనిపిస్తున్న రాకింగ్ స్టార్ యశ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

35
రావణుడిగా నటిస్తే జనాల్లో నెగెటివ్ ఇమేజ్

రీసెంట్‌గా జరిగిన ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో సాయి పల్లవి మాట్లాడుతూ.. రావణుడి లాంటి పాత్రను ఎంచుకోవడం మామూలు విషయం కాదంది. సాధారణంగా రావణుడిగా నటిస్తే జనాల్లో నెగెటివ్ ఇమేజ్ వస్తుందేమో అని చాలామంది భయపడతారు. అందుకే ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వెనకడుగు వేస్తారు. కానీ, ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి రావణుడిగా నటించడానికి ముందుకొచ్చిన యశ్‌ను ఆమె బాగా మెచ్చుకుంది. ఈ క్యారెక్టర్ ఎంచుకోవడమే యశ్ ధైర్యాన్ని చూపిస్తోందని, ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయాలంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలని ఆమె చెప్పింది.

45
భారీ అంచనాలు

'కేజీఎఫ్' సిరీస్‌తో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు యశ్. ఇప్పుడు 'రామాయణ' సినిమాతో మరో డిఫరెంట్ క్యారెక్టర్‌లో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అతను రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. నితీష్ తివారీ డైరెక్షన్‌లో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో ఈ సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కుతోంది. రణబీర్ కపూర్‌తో పాటు చాలామంది స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. పురాణాల ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

55
భారీ బడ్జెట్, టాప్ స్టార్స్

'రామాయణ' సినిమా మొదటి భాగం 2026 నవంబర్ నెలలో రిలీజ్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. భారీ బడ్జెట్, టాప్ స్టార్స్ ఉండటంతో ఈ సినిమా అప్పుడే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రావణుడిగా నటిస్తున్న యశ్‌ను సాయి పల్లవి మెచ్చుకోవడం అభిమానులలో మరింత ఆసక్తిని పెంచింది. స్క్రీన్ మీద సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ ఎలా అదరగొడతారో చూడాలని అభిమానులు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories