సినిమా చేయాలంటే సాయిపల్లవి పెట్టే కండీషన్స్ ఏంటో తెలుసా? ఎవ్వరైనా అది చేయాల్సిందే.. లేడీ పవర్‌ స్టారా మజాకా!

Published : Dec 09, 2023, 03:55 PM IST

సాయిపల్లవి చాలా రోజుల తర్వాత మరో తెలుగు సినిమాతో సందడి చేయబోతుంది. అయితే ఆమె ఓ సినిమా చేయాలంటే కండీషన్స్ పెడుతుందట. ఎవ్వరైనా ఆ పని చేయాల్సిందేనట.   

PREV
16
సినిమా చేయాలంటే సాయిపల్లవి పెట్టే కండీషన్స్ ఏంటో తెలుసా? ఎవ్వరైనా అది చేయాల్సిందే.. లేడీ పవర్‌ స్టారా మజాకా!
Saipallavi new look

సాయిపల్లవి తెలుగులో లేడీ పవర్‌ స్టార్‌ రేంజ్‌ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఓ ఈవెంట్‌లో సాయిపల్లవికి ఉన్న క్రేజ్‌ ని చూసిన దర్శకుడు సుకుమార్‌.. అయితే లేడీ పవర్‌ స్టార్‌ అన్నమాట అంటూ ఆమెకి ట్యాగ్‌ తగిలించాడు. దీంతో అప్పట్నుంచి అంతా అదే పిలుస్తున్నారు. దీనికితోడు సాయిపల్లవి సహజమైన నటనతో మెప్పించడం, అద్భుతమైన డాన్సులతో అదరగొడుతుంది. ఆమె నటించిందంటే ఆ సినిమాలో కచ్చితంగా కంటెంట్ ఉంటుందనే నమ్మకం ఆడియెన్స్ లో ఏర్పడింది. 

26

అంతటి బ్రాండ్‌ వ్యాల్యూని తెచ్చుకుంది సాయిపల్లవి. అయితే ఆమెతో సినిమా చేయాలంటే.. చాలా కండీషన్స్ ఫాలో అవ్వాల్సిందే. అయితే ఆ కండీషన్స్ అంటే ఆమె మనీ డిమాండ్‌ కాదు, లగ్జరీ డిమాండ్ కాదు. కంటెంట్‌ పరమైన డిమాండ్ కావడం విశేషం. తనతో సినిమా అంటే దర్శకులు కొన్ని ఫాలో కావాల్సిందే అంట. అది దర్శక, నిర్మాతలు చేస్తేనే సాయిపల్లవి సినిమా చేస్తుందని అంటున్నారు. మరి ఆ కండీషన్స్ ఏంటంటే..

36

సాయిపల్లవితో సినిమా చేయాలంటే మొదటగా కావాల్సింది తనకు పాత్రకి ప్రయారిటీ. సినిమాలో తన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపించేలా ఉండాలి. అలా అయితేనే ఆమె సినిమా చేస్తుంది. దీనికితోడు కంటెంట్‌ బాగుండాలి. తన పాత్ర మాత్రమే కాదు, సినిమా కథకి కూడా ఆమె ప్రయారిటీ ఇస్తుంది. బలమైన కంటెంట్ ఉంటేనే ఒప్పుకుంటుంది. అంతేకాదు సినిమా ప్రారంభానికి ముందే బౌండెడ్‌ స్క్రిప్ట్ ఉండాలి. అప్పుడే సాయిపల్లవి సినిమా చేయడానికి ఒప్పుకుంటుందట. ఇవన్నీ ఆమె ప్రారంభం నుంచి ఫాలో అవుతుంది. 
 

46

ఇవన్నీ ఓ ఎత్తైతే లేటెస్ట్ గా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సాయి పల్లవితో సినిమా అంటే ముందుగానే వర్క్ షాప్‌ కూడా చేయాల్సి ఉంటుందట. వర్క్ షాప్‌లో సీన్లు ఎలా తీయాలి, ఎప్పుడు తీయాలి, గెటప్స్, లుక్స్ ఇలా అన్నీ పర్‌ఫెక్ట్ గా ముందుగానే చూసుకోవాలట. అందులో తాను కూడా పాల్గొంటుందట. వర్క్ షాప్‌లో తీయబోయే సీన్లకి సంబంధించి అన్ని రిహార్సల్స్ జరుగుతాయి. ఇందులో డౌట్స్ కూడా క్లారిటీ వస్తుంది. 
 

56

ఇదంతా సినిమా బాగా రావడం కోసమే. సాయిపల్లవి సినిమా కోసమే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటుందట. దీనికి ఒప్పుకుంటేనే ఆ సినిమా చేయడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. మొత్తంగా సాయిపల్లవి పెట్టే కండీషన్‌ కూడా ఓ రకంగా అటు హీరోకి, ఇటు నిర్మాతలకు మంచి చేస్తుందని చెప్పొచ్చు. అది బెస్ట్ ఔట్‌ పుట్‌ రావడానికి హెల్ప్ అవుతుంది. అయితే అందరు దీనికి ఒప్పుకోకపోవచ్చు, అలాంటి వారికి నిర్మొహమాటంగా ఈ లేడీ పవర్ స్టార్‌ నో చెబుతుందని టాక్‌. 
 

66

ఇక ప్రస్తుతం సాయిపల్లవి.. నాగచైతన్యతో `తండేల్‌` సినిమాలో నటిస్తుంది. `లవ్‌ స్టోరీ` తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. చందమూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో ఈ మూవీ రూపొందుతుంది. నేడు ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇందులో నాగార్జున, వెంకటేష్‌ పాల్గొన్నారు. చివరగా సాయిపల్లవి.. తెలుగులో `విరాటపర్వం` చిత్రంలో నటించింది. ఇది బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories