Sandeep Reddy Vanga: 36 ఎకరాలు అమ్మేశాడు... బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఆస్తులు ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది?

First Published Dec 9, 2023, 2:53 PM IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి లేటెస్ట్ సెన్సేషన్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తి చేశాడు. ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందట. 
 

సందీప్ రెడ్డి వంగ... ఈ పేరు ఇండియా వైడ్ వినిపిస్తుంది. చట్టసభల్లో కూడా చర్చకు వస్తుంది. సందీప్ రెడ్డి సినిమాలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. సాంప్రదాయవాదులు గగ్గోలు పెట్టేలా ఉంటాయి. ఆయన లేటెస్ట్ మూవీ యానిమల్ సమాజానికి చేటు చేసే చిత్రమని ఏకంగా పార్లమెంట్ వేదికగా ఎంపీ రంజీత్ రంజన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన కూతురు సినిమా మధ్యలోనే ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసిందని ఆమె వెల్లడించారు. 
 

విమర్శలు ఆరోపణలు యానిమల్ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద ఆపలేకపోతున్నాయి. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ముంబైలో 24 హౌర్స్ షోలు వేస్తున్నారని సమాచారం. యానిమల్ మూవీలో మితిమీరిన హింస, శృంగారం ఉన్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ వివాదాస్పదంగా ఉందని కొందరు చిత్ర ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదిక కామెంట్స్ చేస్తున్నారు. 
 

Latest Videos


రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ రూపొందింది. బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. రష్మిక మందాన హీరోయిన్. అనిల్ కపూర్ కీలక పాత్రలో మెప్పించారు. వరల్డ్ వైడ్ 8 రోజులకు యానిమల్ రూ. 600 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు అధికారికంగా తెలియజేశారు. 
 

యానిమల్ సక్సెస్ తో సందీప్ రెడ్డి వంగ రేంజ్ ఊహించని స్థాయికి చేరింది. ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. సందీప్ రెడ్డికి వంద కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే సందీప్ రెడ్డి ఒకప్పుడు ఆస్తులు అమ్ముకుని సినిమా చేశాడు. అది కూడా కేవలం రూ. 1.5 కోట్ల కోసం. 


సందీప్ రెడ్డి వంగ మొదటి చిత్రం అర్జున్ రెడ్డికి నిర్మాత కూడా ఆయనే. భద్రకాళి పిక్చర్స్ పేరుతో బ్యానర్ స్థాపించి అర్జున్ రెడ్డి రూపొందించారు. తన కంటెంట్, డైరెక్షన్ పై నమ్మకంతో సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. ఈ చిత్ర బడ్జెట్ కి అవసరమైన డబ్బుల కోసం కుటుంబానికి చెందిన 36 ఎకరాల మామిడి తోట అమ్మేశాడట. 

ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. ఒకవేళ అర్జున్ రెడ్డి ఫెయిల్ అయితే సందీప్ రెడ్డి రోడ్డున పడాల్సి వచ్చేది. కారణం ఆ సినిమాకు ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేదు. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డిలకు ఫేమ్ లేదు. అర్జున్ రెడ్డి ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఒక భిన్నమైన మూవీ చూడబోతున్నాం, అనే ఫీలింగ్ కలిగించింది. 

2018లో విడుదలైన అర్జున్ రెడ్డి రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్ కేవలం రూ. 5 కోట్లు. పెట్టుబడికి పదింతల వసూళ్లు ఆ మూవీ రాబట్టింది. కాగా యానిమల్ మూవీ చిత్ర నిర్మాణ భాగస్వామిగా సందీప్ రెడ్డి వంగ ఉన్నారు. రూ. 1000 కోట్ల వసూళ్ల దిశగా వెళుతున్న యానిమల్ తో సందీప్ రెడ్డి వంగ భారీ లాభాలు రాబట్టడం ఖాయం... 

యానిమల్, పుష్ప చిత్రాలపై రాజ్యసభలో తీవ్ర విమర్శలు.. నా కూతురు ఏడుస్తూ వచ్చేసింది, ఎంపీ ఫైర్

click me!