ఇంతకి సాయిపల్లవి ఏం చెప్పిందంటే.. తాను వారానికి మూడ్రోజులు వ్యాయామం చేస్తుందట. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుందట. కూరగాయలు, పండ్లు తినేందుకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుందట. ఈ క్రమంలో తాను ఓ కొత్త విషయాన్ని తెలుసుకుందట. ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎలాంటి ఫుడ్ తీసుకున్నా మానసికంగా ఒత్తిడిలో ఉంటే లాభం లేదని చెప్పింది. మానసికంగా ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలని, వాటిపై దృష్టి పెట్టాలని చెప్పింది. మానసికంగా ఇబ్బంది పడుతూ ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఉపయోగం ఉండదని స్పష్టం చేసింది సాయిపల్లవి.