Sai Pallavi: కమల్ హాసన్ ని కలిసిన సాయి పల్లవి.. క్రేజీ కాంబినేషన్, ఫోటోస్ వైరల్

Published : May 09, 2022, 10:26 PM IST

తాజాగా అరుదైన కలయిక జరిగింది. హీరోయిన్ గా సౌత్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని కుర్ర హృదయాలు దోచుకుంటున్న సాయి పల్లవి.. కమల్ హాసన్ ని కలిసింది.

PREV
16
Sai Pallavi: కమల్ హాసన్ ని కలిసిన సాయి పల్లవి.. క్రేజీ కాంబినేషన్, ఫోటోస్ వైరల్

లోక నాయకుడు కమల్ హాసన్ దిగ్గజ నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు నిర్మాత కూడా. ప్రస్తుతం కమల్ హాసన్ సినిమాల్లో నటిస్తూనే వీలు చిక్కినప్పుడు తన ప్రొడక్షన్ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. 

 

26

తాజాగా అరుదైన కలయిక జరిగింది. హీరోయిన్ గా సౌత్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని కుర్ర హృదయాలు దోచుకుంటున్న సాయి పల్లవి.. కమల్ హాసన్ ని కలిసింది. నేడు సాయి పల్లవి తన 30వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. 

36

ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి కొన్ని అప్డేట్లు వచ్చాయి. కమల్ హాసన్ ని ఆమె కలవడం కూడా ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ప్రైజ్ అనే చెప్పాలి. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న 21వ చిత్రం రాజ్ కుమార్ పెరియన్ దర్శకత్వంలో రాబోతోంది. ఈ చిత్రాన్ని కమల్ హసన్ నిర్మిస్తున్నారు. 

46

ఈ చిత్రంలో శివకార్తికేయన్ కి జోడిగా సాయి పల్లవిని ఎంపిక చేశారు. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆ లెజెండ్రీ నటుడ్ని సాయి పల్లవి కలిసింది. 

 

56

కమల్ హాసన్ సర్ ని కలవడం వల్ల ఉత్తమ నటిగా మారే మెళుకువలు నేర్చుకున్నాను. అలాగే మంచి వ్యక్తిగా మారే అంశాలు కూడా ఆయన నుంచి తెలుసుకున్నాను అంటూ సాయి పల్లవి ట్వీట్ చేసింది. 

66

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాయి పల్లవి తెలుగులో చివరగా లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో విజయం దక్కించుకుంది. త్వరలో రానా 'విరాట పర్వం' చిత్రంతో రాబోతోంది. 

click me!

Recommended Stories