NTR-RRR Movie: రాజమౌళి మా ఎన్టీఆర్ ని తొక్కేశావ్... బర్త్ డే రోజు బయటపడిన నిజం, ఆయనపై రగిలిపోతున్న ఫ్యాన్స్!

First Published May 21, 2022, 12:07 PM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీ సూపర్ సక్సెస్. వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లు రాబట్టిన చిత్రం. దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు దేశవ్యాప్తం చేసిన చిత్రం. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

NTR - Rajamouli

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)ప్రకటించిన రోజే ఓ ధర్మ సందేహం వెలుగులోకి వచ్చింది. రైవల్ ఫ్యాన్స్ కలిగిన నందమూరి, మెగా హీరోలు ఎన్టీఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ లో అధిక ప్రాధాన్యత ఎవరికి ఉంటుంది?. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు రాజమౌళిని అడగడం కూడా జరిగింది. ఇద్దరు హీరోలకు కథలో సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా ఉండదన్నారు.

NTR - Rajamouli

చరణ్ (Ram Charan)కంటే ఎన్టీఆర్ రాజమౌళికి అత్యంత సన్నిహితుడు కాగా.. సహజంగా ఎన్టీఆర్ కే కొంత లీడ్ ఉండే ఛాన్స్ కలదని అందరూ ఊహించారు. సినిమా విడుదలయ్యాక. ఇద్దరు హీరోలు పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంది. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఎన్టీఆర్, చరణ్ నువ్వా నేనా అన్నట్లు నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అడవి మృగాలతో బ్రిటీష్ కోటపై దాడి చేసే సన్నివేశం అద్భుతం, ఇక కొమరం భీముడో సాంగ్ లో ఆయన నటన నభూతో నభవిష్యతి అన్నట్లు ఉంది. 
 

NTR - Rajamouli

కానీ ఎన్టీఆర్ (NTR)అభిమానుల్లో ఓ వర్గానికి ఆయన పాత్ర తీర్చిద్దినతీరు నచ్చలేదు. రామ్ చరణ్ పాత్రతో పోల్చితే ఎన్టీఆర్ రోల్ కి ప్రాధాన్యత తగ్గిందనేది వారి అభిప్రాయం. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో అల్లూరి గెటప్ లో చరణ్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్ పాత్రను తొక్కేశారని కామెంట్ చేశారు. సినిమా విడుదల తర్వాత ముంబైలో జరిగిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న రామ్ చరణ్ నిఇదే ప్రశ్న ఓ లేడీ జర్నలిస్ట్ అడిగారు. 
 

NTR - Rajamouli

నా పాత్ర ఎన్టీఆర్ పాత్రను డామినేట్ చేసిందంటే నేను ఒప్పుకోను, ఇద్దరి పాత్రలు సినిమాలో అద్భుతంగా తీర్చిద్దారని డిప్లొమాటిక్ సమాధానం చెప్పి తప్పుకున్నారు. మే 20న ఎన్టీఆర్ జన్మదినం నాడు ఆర్ ఆర్ ఆర్ జీ5 లో అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం మరలా పైకి లేచింది. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ని రాజమౌళి తొక్కేశాడని కామెంట్స్ చేస్తున్నారు. 
 

NTR - Rajamouli


దానికి తోడు ఎన్టీఆర్ కి రాజమౌళి (Rajamouli)బర్త్ డే విషెష్ చెప్పలేదు. ఈ క్రమంలో కావాలనే ఎన్టీఆర్ ని ఆర్ ఆర్ ఆర్ మూవీలో తక్కువ చేసి చూపించాడని విమర్శల దాడికి దిగారు. ఇది ఎన్టీఆర్ కి రాజమౌళి చేసిన తీరని అన్యాయం అంటూ బూతుల దండకం అందుకుంటున్నారు. చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో సెకండ్ హీరో అంటూ ట్రోల్ చేయడం కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనానికి కారణమవుతుంది. 
 

RRR Movie


మొత్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఓ వర్గం ఇప్పుడు రాజమౌళిపై చాలా కోపంగా ఉన్నారు. మరో వర్గం వాళ్ళ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పాత్ర అద్భుతంగా ఉంది. నాలుగు బ్లాక్ బాస్టర్స్ తో ఎన్టీఆర్ కెరీర్ ని తీర్చిదిద్దిన రాజమౌళిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అంటున్నారు.  

click me!